ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తియినట్టు సమాచారం. జూన్ 04న ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈ సారి జూన్ 04న విడుదలయ్యే పదవతరగతి పరీక్ష ఫలితాల్లో కూడా గ్రేడులకు బదులు విద్యార్థులకు వచ్చిన మార్కులు మాత్రమే ప్రకటించనున్నారు.
ఇక పదవతరగతి పరీక్ష ఫలితాలను ప్రకటించిన తరువాత ప్రైవేట్ విద్యాసంస్థలు, సూళ్లు తమ విద్యార్థులకు మొదటి ర్యాంకులు వచ్చాయని ప్రకటనలు ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వం జూన్ 01న ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వు ప్రకారం.. ఏ పాఠశాల అయినా తమ విద్యార్థులకు మంచి ర్యాంకు వచ్చిందని ప్రకటిస్తే మూడేండ్ల నుంచి ఏడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నదని విద్యాశాఖ తేల్చిచెప్పింది.
ఇక జూన్ 04న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి విజయవాడలో ఫలితాలను ప్రకటించనున్నారు. ఈసారి మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనున్నది. రికార్డు స్థాయిలో 25 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనున్నది. ఏప్రిల్ 27న ప్రారంభమైన పదవరతగతి పరీక్షలు మే 09న పూర్తయ్యాయి. ఇక తెలంగాణలో జూన్ 11 వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనున్నది. ఆ తరువాత పరీక్ష ఫలితాలను ప్రకటించనున్నారు.
Also Read :
ఫేస్ బుక్ కు ఊహించని షాక్.. ఉద్యోగాన్ని వీడనున్న కీలక ఉద్యోగి..!
గుడ్లు దొంగిలించాలనుకున్న అనుకున్న అమ్మాయికి ఊహించని షాక్..!అసలు ఏమి జరిగిందంటే..?