భారతదేశంలో చాలామంది ప్రజలు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా శివుడు అంటే చాలామందికి ప్రీతిపాత్రం. అలాంటి మహా శివుడిని ప్రతి సోమవారం భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహం కోసం అనేక దీక్షలు చేస్తూ ఉంటారు. మరి ఎలాంటి శివున్ని అన్ని శుభాలే అందించే దైవంగా భావిస్తారు. అందుకే శివుడిని బోలాశంకరుడిగా పిలుస్తారు. అయితే చాలామంది ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజించాలని అనుకుంటారు.
Advertisement
ఈ తరుణంలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అసలు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా.. ఒకవేళ పెట్టుకుంటే ఎలాంటి పరిమితులు ఉంటాయి.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చు. కానీ ఆ ఇంట్లో పెట్టుకునే శివలింగ ఆకారం బొటనవేలు సైజులో ఉండాలన్నమాట. ఆ సైజులో ఉన్న శివలింగాన్ని పూజిస్తేనే మంచి జరుగుతుందని అంటుంటారు. అంతకంటే ఎక్కువ సైజు మించరాదు. ముఖ్యంగా శివలింగాన్ని పూజించేటప్పుడు వేదమంత్రాలతో అభిషేకం చేస్తూ నియమనిష్ఠలను పాటిస్తూ ఉంటాం.
Advertisement
ఒకవేళ నియమాలతో శివలింగాన్ని పూజించకపోతే దోషం ఏర్పడుతుందట అశుభం కలుగుతుందట. జీవితంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని కాబట్టి నియమనిష్ఠలతో శివలింగాన్ని పూజించాలని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా శివుని ప్రతి సోమవారం పూజిస్తే జీవితం సుఖమయమే కాకుండా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.
also read: