Home » పెళ్లి చేసుకోబోతున్న అనుష్క.. ప్రభాస్ ను మాత్రం కాదు…!

పెళ్లి చేసుకోబోతున్న అనుష్క.. ప్రభాస్ ను మాత్రం కాదు…!

by Azhar
Ad
టాలీవుడ్ కు సూపర్ అనే సినిమాతో ఎంట్రీ అనేది ఇచ్చింది అనుష్క. మంగుళూరు లో జన్మించిన అనుష్క.. ఇక్కడ తెలుగులోనే ఎక్కువ సినిమా చేసింది. అయితే మొదటి సినిమా సూపర్ అంతగా సక్సెస్ ఇవ్వకపోయినా.. ఈ అమ్మడి హైట్ అలాగే యాక్టింగ్ వల్ల అవకాశాలు అనేవి ఎక్కువగా వచ్చాయి. ఇక అప్పటి నుండి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన అనుష్క.. అటు ప్రేమ చిత్రాలు అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే అందులో ప్రభాస్ తో ఈ అమ్మడు చేసిన సినిమాలు అనేవి మంచి హిట్ సాధించాయి.
దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో వీరు కలిసి తీసిన బాహుబలి అనే సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలవడంతో… వీరు ఇక పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి అందులో నిజం లేదు అని ప్రభాస్, అనుష్క ఇద్దరు చెబుతూనే వచ్చారు. అయితే బాహుబలి వంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత అనుష్క ఎక్కువ సినిమాలు చేయలేదు. చివరిగా ఈ అమ్మడు చేసిన సినిమా నిశ్శబ్దం. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరం అయిపోయింది.
అయితే ఈ మధ్యే అనుష్క లివిన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాలో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆ సినిమా నుండి కూడా అనుష్క తప్పుకున్నట్లు తెలుస్తుంది. అందుకు కారణం ఆమె పెళ్లి చేసుకోబోతుండటం అంట. ప్రభాస్ తో డేటింగ్ అనే వార్తలకు శాశ్వతంగా చెక్ పెడుతూ.. అనుష్క బెంగళూర్ కు చెందిన ఓ ప్రముఖ బిజినెస్ పర్సన్ ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇంకా తొందర్లోనే అనుష్క ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలను కూడా బయటపెట్టనునట్లు తెలుస్తుంది. ఈ పెళ్లి వల్లే అనుష్క పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పనికి సిద్ధం అయినట్లు కూడా సమాచారం.

Advertisement

Visitors Are Also Reading