Home » అరుంధ‌తి చిత్రం పై అనుష్క ఎమోష‌న‌ల్ పోస్ట్

అరుంధ‌తి చిత్రం పై అనుష్క ఎమోష‌న‌ల్ పోస్ట్

by Anji

తెలుగు ఇండ‌స్ట్రీలో అనుష్క‌ను ఓ స్టార్ హీరోయిన్‌గా నిల‌బెట్టిన చిత్రం ఏదైనా ఉందంటే..తొలుత అరుంధ‌తి అనే చెప్పుకోవ‌చ్చు. అప్ప‌టి వ‌ర‌కు అందాల ఆర‌బోత‌కే ప్రాధాన్య‌మిచ్చిన అనుష్క ఆ చిత్రం ద్వారా ఏకంగా త‌న పూర్తిస్థాయి న‌ట విశ్వ‌రూప‌మే చూపించిన‌ది. బాక్సాఫీస్‌ను షేక్ చేసి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఏకంగా అనుష్క జీవితాన్నే మార్చేసింది.

Stunning pics of anushka shetty from arundhati

ఈ సినిమా త‌రువాత అనుష్క‌ను అరుంధ‌తి అని కొంద‌రూ.. జేజ‌మ్మ అని మ‌రికొంద‌రూ ఇలా ప్రేక్ష‌కుల మ‌న‌సులో ముద్ర ప‌డిపోయింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అనుష్క‌శెట్టి త‌న కెరీర్‌లో గుర్తుండిపోయే బిగ్ బ్లాక్ బాస్ట‌ర్‌ చిత్రం అరుంధ‌తి. అనుష్క న‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసిన‌ది. ముఖ్యంగా అనుష్క స్టార్ హీరోయిన్‌గా మార‌డ‌మే కాకుండా మ‌ళ్లీ లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌కు ప్రాణ‌మిచ్చిన‌ది. అదేవిధంగా చాలా మంది హోరోల‌కు సైతం సాధ్యం కాని రికార్డుల‌ను అనుష్క ఈ చిత్రంతో సాధించిన‌ది. స్టార్ హీరోలు లేకుండానే రూ.15కోట్ల బ‌డ్జెట్‌తో దాదాపు 70 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించింది అరుంధ‌తి. ఈ త‌రుణంలోనే అరుంధ‌తి చిత్ర‌మును గుర్తు చేసుకుంటూ అనుష్క తాజాగా ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసింది.

Anushka Shetty remembers Arundhati as film completes 13 years -  www.khaskhabar.com

ఏ న‌టికైనా ఇలాంటి అవ‌కాశం జీవితంలో ఒకేసారి వ‌స్తుంద‌ని.. అరుంధ‌తి చిత్రంలోని జేజ‌మ్మ పాత్ర నా జీవితంలో అలాందినేని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప‌, మంచి అవ‌కాశాన్ని క‌ల్పించిన ద‌ర్శ‌కుడు కోడిరామ‌కృష్ణ‌, నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్‌రెడ్డిల‌కు, అరుంధ‌తి టీమ్ మొత్తానికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు అని పోస్ట్ చేసింది అనుష్క‌.

Visitors Are Also Reading