Telugu News » Blog » విరాట్ కోహ్లీకి తీవ్ర అనారోగ్యం… అనుష్క ఎమోషనల్..!

విరాట్ కోహ్లీకి తీవ్ర అనారోగ్యం… అనుష్క ఎమోషనల్..!

by Bunty
Ads

 

టీమిండియా స్టార్ క్రికెటర్  విరాట్ కోహ్లీ తన కెరీరులో మరో మైలురాయిని అందుకున్నారు. టెస్టుల్లో 28వ సెంచరీ సాధించిన అతను ఓవరాల్ గా 75వ అంతర్జాతీయ శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో అభిమానులంతా చాలా సంతోషించారు. మా కింగ్ మళ్లీ ఏలడానికి వచ్చేసాడంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు.

Advertisement

Read Also: భూమా మౌనిక వీపుపై సీక్రెట్ టాటూ… మనోజ్ ఆగ్రహం ?

ఇలాంటి సమయంలో కోహ్లీ భార్య అనుష్క శర్మ సంచలన విషయాలు వెల్లడించింది. కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన అనుష్క శర్మ అతనికి ఆరోగ్యం బాగాలేదని తెలిపింది. ‘ఆరోగ్యం బాగా లేకపోయినా ఇంత కంపోజర్ తో ఆడావు. నన్ను ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటావు’ అని పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు షాక్ అయ్యారు. కోహ్లీకి ఆరోగ్యం బాగాలేదా? అని ఆశ్చర్యపోయారు. అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ చాలా డెడికేటెడ్ గా కనిపించాడు.

Advertisement

దుర్భేద్యమైన డిఫెన్స్ తో ఆసీస్ బౌలింగ్ ఎదుర్కొన్నారు. అతను అంత డిసిప్లిన్ గా ఆడింది ఒంట్లో బాగా లేకుండానా? అని కామెంట్లు చేశారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ చాలా రికార్డులు బద్దలు కొట్టాడు. స్వదేశంలో అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. అలాగే టెస్టుల్లో 28వ సెంచరీ సాధించాడు. ఓవరాల్ గా 75వ అంతర్జాతీయ సెంచరీ చేసి, వంద సెంచరీల సచిన్ రికార్డుకు మరింత చేరువయ్యాడు.

Advertisement

Read Also : Dasara : “దసరా” ట్రైలర్ విడుదల.. గత్తర్ లేపిన నాని