Home » అనుష్క పెళ్లి ఫిక్స్ కానీ ప్ర‌భాస్ తో కాద‌ట‌..? ఎవ‌రితో అంటే..?

అనుష్క పెళ్లి ఫిక్స్ కానీ ప్ర‌భాస్ తో కాద‌ట‌..? ఎవ‌రితో అంటే..?

by AJAY

టాలీవుడ్ అందాల తార స్వీటీ అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో నటించింది. మొదట నాగచైతన్యకు యోగా గురువుగా సమంత వ్యవహరించింది. అయితే అదే సమయంలో నాగర్జున కంటపడటంతో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చారు. అలా సూపర్ సినిమాలో అనుష్క ఛాన్స్ అందుకుంది.

మొదటి సినిమాలోనే అందాలను ఆరబోసి కుర్రాలను తన‌ వైపు తిప్పుకుంది. మత్తు కళ్ళతో జీరో ఫిజిక్ తో అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే అరుంధతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా తర్వాత చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అల‌రించింది.

చివ‌ర‌గా అనుష్‌క నిశ్శ‌బ్దం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కానీ ఈ సినిమా అనుకున్న మేర‌ విజయం సాధించలేదు. మరోవైపు అనుష్క ప్రస్తుతం న‌వీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న‌ ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్కకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. 42 ఏళ్లకు చేరువ అవుతున్న అనుష్క ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Anushka Shetty

Anushka Shetty

కానీ తాము స్నేహితులం అని ఇప్పటికే ప్రభాస్ అనుష్కలు ప్రకటించారు. ఇక‌ ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వచ్చింది. అనుష్క ఇటీవల గోవాలో తన యోగా గురువును కలుసుకున్నట్టు తెలుస్తోంది. గురువు సలహా మేరకు తాను ఈ ఏడాది వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తెలంగాణకు చెందిన ఓ గోల్డ్ స్మిత్ తో అనుష్క పెళ్లి జ‌ర‌గ‌బోతుంద‌ని టాక్. అయితే ఇందులో ఇంతవరకు నిజం ఉందో తెలియాలంటే అనుష్క నోరు విప్పాల్సిందే.

Visitors Are Also Reading