Home » కార్తికేయ-2 ప్రమోషన్స్ కు అనుపమ దూరం.. ఎందుకంటే..?

కార్తికేయ-2 ప్రమోషన్స్ కు అనుపమ దూరం.. ఎందుకంటే..?

by Azhar
Ad

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా ఎవరు ఊహించని సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాతో నిఖిల్ రెండు అమాంతం పెరిగిపోయింది అనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా గతంలో వచ్చినా కార్తికేయ 2 సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. మొదటి సినిమాలో స్వాతి హీరోయిన్ గా నటించగా.. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించింది.

Advertisement

అయితే కార్తికేయ 2 సినిమా విడుదలకు సమయం అనేది దగ్గరకు వచ్చిన తర్వాత నుండి నిఖిల్ కు అనుపమకు మధ్య విబేధాలు వచ్చినట్లు తెగ వార్తలు వచ్చాయి. కానీ సినిమా విడుదల అయ్యి బంపర్ హిట్.. ముఖ్యంగా బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన తర్వాత అనుపమ, నిఖిల్ కలిసి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. దాంతో వారికీ మధ్య ఏ విబేధాలు లేవు అని తేలింది.

Advertisement

కానీ ఈ కార్తికేయ 2 కు బాలీవుడ్ లో భారీ జనాదరణ లభించడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ బాగా చేస్తుంది. కానీ ఇందులో మొదట్లో పాల్గొన అనుపమ ఈ మధ్య మళ్ళీ ప్రమోషన్స్ లో మిస్ అవుతుంది. అయితే అందుకు కారణాలు ఏంటి అని తెలుసుకుంటే.. అనుపమకు కరోనా వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే హైదరాబాద్ లో చేసిన ప్రమోషన్స్ తర్వాత అనుపమ మళ్ళీ ప్రమోషన్స్ లో కనిపించడం లేదు అనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

నాలో సత్తా లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు..!

కేఎల్ రాహుల్ తో కూతురి పెళ్లిపై సునీల్ శెట్టి క్లారిటీ..!

Visitors Are Also Reading