ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక నితిన్ హీరోగా నటించిన అఆ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర చేసినప్పటికీ అనుపమ అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకున్న అనూ ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తూ వచ్చింది.
Advertisement
కానీ రీసెంట్ గా దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన రౌడీ బాయ్స్ సినిమాలో నటించి సర్ప్రైజ్ చేసింది. ఈ సినిమాలో అనుపమ గ్లామర్ షో తో రెచ్చిపోయింది. అంతే కాకుండా గ్లామర్ పాత్రలకు సైతం తాను రెడీ అంటూ దర్శకనిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న విజయం సాధించలేదు.
Advertisement
కానీ ఈ సినిమాలో కొన్ని సీన్లు ఒప్పుకోవడంతో ప్రేక్షకులు రెమ్యూనరేషన్ కోసమే అనుపమ అలాంటి సీన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ విమర్శలు కురిపించారు. ఇదిలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో అనుపమ నైట్ డ్రెస్ లో బేబీ బంప్ తో కనిపిస్తోంది.
దాంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొంతమంది అయితే కంగ్రాట్స్ అనుపమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఫోటో చాలా రోజుల క్రితం ది అని అనుపమ పేర్కొంది. దాంతో ఏదో సినిమా షూటింగ్ కోసం అనుపమ ఇలా రెడీ అయినట్టుగా కనిపిస్తోంది.