Telugu News » ముద్దు సీన్ పై ట్రోల్స్….అత‌డి వ‌ల్లే అంటూ క్లారీటీ ఇచ్చిన అనుప‌మ‌…!

ముద్దు సీన్ పై ట్రోల్స్….అత‌డి వ‌ల్లే అంటూ క్లారీటీ ఇచ్చిన అనుప‌మ‌…!

by AJAY MADDIBOINA

ప్రేమమ్ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ బ్యూటీ మొదటి సినిమా నుండి ఎక్కడా హద్దులు దాటలేదు. ముద్దు సీన్లు రొమాన్స్ సీన్ లకు చాలా దూరంగా ఉంది. కానీ రీసెంట్ గా తను కూడా వాటికి సిద్ధమంటూ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. ఇక‌ ఇటీవల విడుదలైన రౌడీ బాయ్స్ సినిమా ట్రైలర్ లో అనుపమ రెచ్చిపోయింది. దిల్ రాజు నట వారసుడిగా ఆయన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి రౌడీ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

Ads

anupama

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పటివరకు అనుపమ టాలీవుడ్ లో పలువురు హీరోలతో సినిమాలు చేసింది కానీ ఏ సినిమాలో ముద్దు పెట్టలేదు. కానీ కొత్త హీరోకు ముద్దు పెట్టడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెమ్యునరేషన్ కోసం ఇంత దిగజారుతావా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరికొన్ని రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పై మీమ‌ర్స్ కూడా త‌మ క్రియేటివీటీతో ట్రోల్స్ చేస్తూ రెచ్చిపోయారు.

అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఆశిష్ రెడ్డి అనుపమకు సినిమాపై వచ్చిన మీమ్స్ ను చూపించారు. మొద‌ట‌గా అనుప‌మ మీమ్స్ చూసేందుకు ఇష్ట‌ప‌డలేదు కానీ ఆ త‌ర‌వాత ఓకే చెప్పింది. అయితే ఓ నెటిజన్ ఏంటి అనుపమ ఇది అంటూ ఫైర్ అవుతున్న ఇమోజీ ని జోడించాడు.

anupama kiss

దానికి అనుపమ స్పందిస్తూ స్వారీ ఇంకా నేను ఆశిష్ రెడ్డిని ట‌చ్ చేయ‌ను అంటూ చెప్పుకొచ్చింది. ఆశిష్ ముద్దు పెట్టాడు అని అతడివల్లే అందరూ హర్ట్ అవుతున్నారని సరదాగా చెప్పుకొచ్చింది. దాంతో ఆశిష్ రెడ్డి అది తాను కాద‌ని సినిమాలో ఉన్న క్యారెక్ట‌ర్ అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఫ‌న్నీ ఫ‌న్నీగా ఇద్దరి సంభాష‌ణ సాగిపోయింది.

also read : సీఎం జ‌గ‌న్ తో భేటీ అనంత‌రం చిరంజీవి కీల‌క‌వ్యాఖ్య‌లు..సినిమా ఇంకా మిగిలే ఉంది.!


You may also like