Home » ఆయన సినిమాలో అవకాశం వస్తే అస్సలే వదులుకోను..!

ఆయన సినిమాలో అవకాశం వస్తే అస్సలే వదులుకోను..!

by Azhar
Ad

టాలీవుడ్ లో ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ అందులో ఒక్కొక్కరికి ఒక్కో గుర్తింపు అనేది ఉంటుంది. ఇక టాలీవుడ్ లోకి అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ యొక్క ప్రత్యేకత అనేది ఆమె కళ్ళు. మొత్తం ఆ కళ్ళతోనే తన భావాలను ఆమె పలికించగలదు. అయితే మొదటి సినిమాలో మంచి గుర్తింపు వచ్చి అనుపమకు అవకాశాలు అనేవి ఎక్కువగానే వచ్చాయి.

Advertisement

కానీ బ్యాడ్ లక్ ఏంటో తెలియదు గాని అనుపమ నటించిన ఎక్కువ సినిమాలు అభిమానులను మెప్పించలేదు. అందుకే కొంచెం ఛాన్సులు అనేవి తగ్గాయి. కానీ ఇప్పుడు అనుపమ నిఖిల్ హీరోగా వస్తున్న కార్తికేయ 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెల 13న ఈ సినిమా థియేటర్లోకి వస్తుండటంతో ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో ఎక్కువగా అనుపమ పాల్గొంటుంది. ఇక తాజాగా పాల్గొన ఓ ఇంటర్వ్యూలో అనుపమ మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిన అనుపమ.. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అస్సలే వదులుకోను అని ప్రకటించింది. ఇక ఆయన నటించే సినిమాలు అన్ని తప్పకుండ చూస్తాను అని పేర్కొంది. అనుపమ మెగాస్టార్ గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చిరంజీవి తన అభిమాన హీరో అని చెప్పిన అనుపమ.. ఇప్పుడు ఆయనతో నటించాలని ఉంది అంటూ చెప్పకనే చెప్పింది.

ఇవి కూడా చదవండి :

అప్పుడు ధోని రోహిత్ ను.. ఇప్పుడు అతను సూర్యను..!

విరాట్ కు అదనపు బాధ్యతలు ఇవ్వనున్న బీసీసీఐ..?

Visitors Are Also Reading