Home » నటించిన ఒకే సినిమా హిట్… ఆ తర్వాత సినిమాలు అన్ని ఫట్… అయినప్పటికీ ఫుల్ అవకాశాలను దక్కించుకుంటున్న బ్యూటీ..!

నటించిన ఒకే సినిమా హిట్… ఆ తర్వాత సినిమాలు అన్ని ఫట్… అయినప్పటికీ ఫుల్ అవకాశాలను దక్కించుకుంటున్న బ్యూటీ..!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది ముద్దుగుమ్మలు వస్తుంటారు… పోతుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కెరియర్ను కొనసాగించాలి అన్న టాప్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకోవాలి అంటే ముద్దుగుమ్మలకు విజయాలు ప్రధాన ప్రాతిపదికగా నిలుస్తూ ఉంటాయి. నటించిన మూవీలు విజయాలను సాధిస్తూ ఉంటే హీరోయిన్లకు వరుస క్రేజీ మూవీ అవకాశాలు దక్కుతూ ఉంటాయి.

Advertisement

అదే సినిమాలు కనక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినట్లు అయితే హీరోయిన్లకు అవకాశాలు వరుసగా తగ్గుతూ వస్తాయి. అలా రెండు, మూడు మూవీలు కనక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ లు అయినట్లు అయితే కొంతకాలానికే హీరోయిన్లు ఇండస్ట్రీలో కనుమరుగు అవుతుంటారు. కాకపోతే కొంతమంది మాత్రం వరుస అపజాయలను ఎదుర్కొన్నప్పటికీ క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు.

Advertisement

అలాంటి వారిలో అను ఇమాన్యుయల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా రూపొందిన మజ్ను మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. దానితో అనుకు అనేక సినిమా అవకాశాలు దక్కాయి. కాకపోతే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు. అయినప్పటికీ వరుస సినిమా అవకాశాలు అనుకు లభిస్తున్నాయి.

మజ్ను మూవీ తర్వాత అను వరుసగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, శైలజ రెడ్డి అల్లుడు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మహా సముద్రం, అల్లుడు అదుర్స్, ఊర్వశి ఓ రాక్షసివో, రావణాసుర సినిమాల్లో నటించింది. ఈ మూవీలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజాయలను అందుకోలేదు. ఇలా ఈ బ్యూటీ నటించిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుకి క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.

Visitors Are Also Reading