తెలుగు ఇండస్ట్రీ లో లెజండరీ యాక్టర్ గా పేరుపొంది ఇండస్ట్రీని ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కినేని నాగేశ్వరరావు. ఆయన చేసిన ప్రతి సినిమా అప్పట్లో సూపర్ హిట్టే. తన నటనా చాతుర్యంతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. ఆయన సీనియర్ ఎన్టీఆర్ తో ఎన్నో చిత్రాల్లో నటించి మరింత క్రేజ్ ను సంపాదించారు. ఎన్నో కుటుంబ నేపథ్య కథాచిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన అక్కినేని చివరి దశలో మాత్రం క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు. ఆయన చివరి రోజుల్లో ఎవరిని కూడా తన దగ్గరికి రానీయలేదనే విషయం ఈ మధ్యకాలంలో వినబడుతోంది.
Advertisement
ప్రముఖ నటుడైన కాదంబరి కిరణ్ ఏఎన్నార్ మృతి చెందే కొద్ది రోజుల ముందు జరిగినటువంటి సంఘటన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో ఉన్నప్పుడు చూసినటువంటి ఏకైక మనిషిని నేనేనని అన్నారు. ఏఎన్ఆర్ చనిపోయే కొద్ది రోజుల ముందు ఆయనను ఎక్కడ ముట్టుకున్నా చర్మం ఊడి వచ్చేదని అన్నారు. ఈ సందర్భంలోనే ఉదయ్ కిరణ్ మరణం గురించి తెలిసి ఆ కుర్రాడు అలా చేయకూడదని ఏఎన్ఆర్ అన్నారని కిరణ్ తెలిపారు.
Advertisement
ఏడిస్తే నాకు అధైర్యం కలుగుతుందని ఆ కారణం వల్లే చాలా మందిని చికిత్స తీసుకుంటున్న సమయంలో చూడడానికి ఆయన ఒప్పుకోలేదని కిరణ్ అన్నారు. క్యాన్సర్ వచ్చిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పానని, ఏఎన్నార్ కు చాలా దగ్గరగా ఉన్నానని కాదంబరి కిరణ్ ఆయనను తలుచుకుని బాధ పడ్డారు. ఆయన చనిపోయే సమయంలో బొంబాయిలో ఉండడంతో రాలేకపోయానని తెలియజేశారు. నా ప్రాణం నిలబెట్టిన వ్యక్తులలో ఏఎన్ఆర్ ఒకరని, కిరణ్ అన్నారు. ఈ విధంగా కాదంబరి కిరణ్ ఏఎన్ఆర్ చివరి రోజులను గుర్తు చేసుకున్నారు.
ALSO READ:
- నిజమైన “బింబిసారుని” చరిత్ర మీకు తెలుసా..?
- చిరంజీవిపై విషప్రయోగం గురించి అసలు విషయాన్ని బయటపెట్టిన మురళీమోహన్..!