Home » ఆ స్టార్ హీరోయిన్ ని చూసి ఏఎన్నార్ భ‌య‌ప‌డేవారంట.. ఎందుకంటే..?

ఆ స్టార్ హీరోయిన్ ని చూసి ఏఎన్నార్ భ‌య‌ప‌డేవారంట.. ఎందుకంటే..?

by Anji
Ad

 టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుల్లో ఎన్టీఆర్‌-ఎన్నార్ అంటే తెలియ‌ని వారుండ‌రు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి ఎన్టీఆర్‌-ఏఎన్నార్ రెండు క‌ళ్ల‌లాంటి వారి చాలా మంది సీనియ‌ర్ పెద్ద‌లు పేర్కొంటుంటారు. ఇండ‌స్ట్రీ అభివృద్ధి చేయ‌డానికి వీరి కృషి ఎంతో ఉంది అని ప‌లు సంద‌ర్భాల్లో ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు న‌టీన‌టులు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మ‌ద్రాస్ నుంచి సినిమా ఇండ‌స్ట్రీ త‌ర‌లించ‌డంలో ఏఎన్నార్ కృషి ఎక్కువ‌గా ఉంద‌ట‌. మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్ త‌ర‌లించ‌డం ఎన్టీఆర్ కి తొలుత అస‌లు ఇష్ట‌మే లేద‌ట‌.

  ఇవి కూడా చ‌ద‌వండి :  మ‌హేష్ ఫ్యాన్స్ రికార్డుని ప‌వ‌న్ అభిమానులు బీట్ చేస్తారా..? 

Advertisement


ఏఎన్నార్ ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోయిన్ల‌తో క‌లిసి న‌టించారు. సావిత్రి లాంటి మ‌హాన‌టితో సైతం ఏఎన్నార్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఏఎన్నార్‌కి హీరోయిన్ల తో చాలా క్లోజ్ గా ఉండేవాడ‌ట‌. హీరోయిన్ల విష‌యంలో ఎంతో ప్రేమ‌గా, సెట్స్‌ల‌లో అయితే స‌ర‌దాగా చిలిపి ప‌నులు చేస్తూ వారిని ఓ ఆట ప‌ట్టిస్తూ ఉండ‌డంతో పాటు వారిపై చ‌మ‌క్కులు కూడా వేసేవార‌ట‌. ఎక్కువ‌గా హీరోయిన్లు ఎన్టీఆర్ కంటే ఏఎన్నార్‌ని ఇష్ట‌ప‌డ‌తార‌ని అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీలో టాక్ వినిపించేది. ఎన్టీఆర్ సెట్‌లో చాలా గంభీరంగా ఉండ‌డంతో ఆయ‌న‌ను చూసి భ‌య‌ప‌డేవార‌ట‌. హీరోయిన్లు షూటింగ్ విష‌యంలో చాలా సీరియ‌స్‌గా ఉండేవార‌ట‌. ఎన్టీఆర్ సెట్‌లో గంభీరం. ఏఎన్నార్ సెట్‌లో ఉంటే అక్క‌డ అంతా సంద‌డిగా ఉండేద‌ట‌.

Advertisement

ముఖ్యంగా ఏఎన్నార్ త‌న కెరీర్ లో చాలా మంది స్టార్ హీరోయిన్ల‌తో న‌టించారు. అందులో జ‌య‌ప్ర‌ద‌, వాణిశ్రీ‌, జ‌య‌చిత్ర‌, సావిత్రి, శ్రీ‌విద్య‌, జ‌య‌సుధ ఇలా అప్ప‌టిత‌రం టాప్ హీరోయిన్‌లంద‌రితో న‌టించారు. ఇక స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ సెట్‌లో ఉంటే త‌న‌కు ఎందుకో భ‌యం ఉంటుంద‌ని ఏఎన్నార్ అనేవార‌ట‌. ఈ విష‌యాన్ని సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీమోహ‌న్ వెల్ల‌డించారు. జ‌య‌సుధ గొప్ప న‌ట‌న గురించి ఏఎన్నార్ చెప్పిన మాట‌ల‌ను ముర‌ళి మోహ‌న్ గుర్తు చేసారు. హీరోయిన్ జ‌య‌సుధ‌పై సింగిల్ షాట్స్ తీస్తున్న‌ప్పుడు ఆమె ఎక్స్ ప్రెష‌న్స్ ఎలా ఇస్తుందో మ‌నం గ‌మ‌నించ‌క‌పోతే త‌రువాత ఇద్ద‌రిపై తీసే కామ‌న్ షాట్స్‌లో మ‌నం ఆమెను మించేలా ఎలా ఉండాలో తెలియ‌క అయోమ‌యంలో ప‌డ‌తామ‌ని ఏఎన్నార్ ముర‌ళీమోహ‌న్ తో చెప్పార‌ట‌.

ఇవి కూడా చ‌ద‌వండి :  రతన్ టాటాకు ఈ 28 ఏళ్ల కుర్రాడికి మధ్య ఇంత మంచి సంబంధం ఉందా.. ఎవరా వ్యక్తి..?

Visitors Are Also Reading