Home » వెలుగులోకి మ‌రో యువ క్రికెట్‌.. ఎవ‌రంటే..?

వెలుగులోకి మ‌రో యువ క్రికెట్‌.. ఎవ‌రంటే..?

by Anji
Ad

చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో మ‌రొక యువ ఆట‌గాడు వెలుగులోకి వ‌చ్చాడు. ఈ మ్యాచ్‌తో పంజాబ్ త‌రుపున ఐపీఎల్‌లోకి ఆరంగ్రేటం చేసిన వైభ‌వ్ అరోరా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అంంద‌రి దృష్టి ఆక‌ర్షించాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో త‌న స్వింగ్‌తో చెన్నై టాప్ ఆర్డ‌ర్‌ను వ‌ణికించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవ‌ర్లు వేసిన అరోరా 21 ప‌రుగులు ఇచ్చి రెండు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న చెన్నై ఆట‌గాళ్లు రాబిన్ ఉత‌ప్ప మొయిన్ అలీల‌ను పెవిలీయ‌న్‌కు పంపి ప్రారంభంలోనే చెన్నైని కోలుకోలేని దెబ్బ తీశాడు.

Advertisement

Advertisement

దీనితో వైభ‌వ్ అరోరా గురించి తెలుసుకునేందుకు ప‌లువురు ఆస‌క్తి చూపుతున్నారు. అస‌లు ఈ క్రికెట‌ర్ ఎవ‌రు అని ఆరాలు తీస్తున్నారు. వైభ‌వ్ అరోరా హ‌ర్యానా ఆట‌గాడు. డిసెంబ‌ర్ 14, 1997న జ‌న్మించిన వైభ‌వ్ అరోరా మూడేండ్ల క్రితం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ త‌రుపున డొమెస్టిక్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసాడు. సౌరాష్ట్ర పై తొలి ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడాడు. 2021 టీ-20ల‌లో ఛ‌తీస్‌గ‌డ్‌పై ఆరంగేట్రం చేసాడు. ఐపీఎల్ 2020 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ నెట్ బౌల‌ర్గా ప‌ని చేశాడు. గ‌త సీజ‌న్‌లో వైభ‌వ్ ఆరోరాను కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తీసుకున్నా అత‌డికి తుది జ‌ట్టులో ఆడే అవ‌కాశం ద‌క్క‌లేదు.

Visitors Are Also Reading