తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటికొస్తుంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో డజన్ మందిని జైలుకు పంపిన సిట్ అధికారులు మరో నలుగురు పాత్ర దారులను గుర్తించారు. ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు పేపర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. నవాబ్ పేటకు చెందిన ప్రశాంత్ లీకైన ప్రశ్నపత్రాన్ని సంపాదించి మార్చి 5న జరిగిన ఏఈ పరీక్ష రాసినట్టు గుర్తించారు.
Advertisement
Also Read : అన్నదమ్ముల వివాదంపై మంచు మనోజ్ ఏమన్నారో తెలుసా ?
Advertisement
అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే.. షాద్ నగర్ కి చెందిన మరో ఇద్దరూ కూడా ఏఈ పరీక్ష రాసినట్టు సమాచారం. తాజాగా ఈ కేసులో తిరుపతి అనే వ్యక్తిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టు అయిన వారి సంఖ్య 15కి చేరింది. రేణుక భర్త డాక్యానాయక్ ద్వారా తిరుపతి ఏఈ ప్రశ్నాపత్రం పొంది, దానిని రాజేందర్ విక్రయించినట్టు సమాచారం. TSPSC మరో ప్రధాన నిందితుడు ప్రవీణ్ ఇంట్లో రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు సిట్ అధికారులు వెల్లడించారు. ప్రవీణ్ ఇంట్లో సోదాలు చేపట్టగా.. శంకరలక్స్మీ డైరీ నుంచి పాస్ వర్డ్ చోరీ చేసినట్టు అధికారులు నిర్దారణకు వచ్చారు. దీంతో కంప్యూటర్ లో ప్రశ్నపత్రాల సమాచారాన్ని చోరీ చేసినట్టు గుర్తించారు. రాజశేఖర్ ద్వారా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్న పత్రాన్ని ప్రశాంత్ పొందారు.
Also Read : బాలయ్య వసుంధరల పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదు..? ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే..!
గత ఏడాది గ్రూపు 1 పరీక్ష రాయడానికి న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్ కి వచ్చినట్టు గుర్తించారు. రాజశేఖర్ భావ ప్రశాంత్ కి LOC నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. మరోవైపు పేపర్ లీక్ కేసులో ముగ్గురు నిందుతులు అయినటువంటి షమీమ్, సురేష్, రమేష్ ని సిట్ కస్టడీకి కోరింది. మంగళవారం నాంపల్లి కోర్టు కస్టడిపై తీర్పు ఇవ్వనుంది. నిందితులు బెయిల్ కోసం కోర్టుకు అప్లై చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 65 మందిని విచారించింది సిట్. పరీక్ష రాసిన 65 మందికి లీకేజీతో సంబంధం లేదని నిర్థారణకు వచ్చింది సిట్.
Advertisement
Also Read : ఉదయం నిద్ర లేవగానే మీకు నీరు తాగే అలవాటు ఉందా ? దీంతో అద్భుతమైన ప్రయోజనాలు..!