Home » అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. ఆ ఘనత సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్.. !

అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. ఆ ఘనత సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్.. !

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఇన్ స్టా గ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్ల మైలు రాయిని ఆయన అందుకున్నారు. దీంతో దక్షిణ భారతదేశం నుంచి ఈ ఘనత అందుకున్న తొలి నటుడిగా అల్లు అర్జున్ అభిమానులు ఈ రికార్డును ఎంజాయ్ చేస్తున్నారు. తమ హీరో ఇన్ స్టాగ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని అందుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఓ పోస్టర్ కూడా సర్క్యూలేట్ అవుతోంది.  

Also Read :   ప్రేమించిన‌వాడే ఆమె పాలిట య‌ముడ‌య్యాడు…పెళ్లికి నో చెప్పింద‌ని ఏం చేశాడంటే..?

Advertisement

వాస్తవానికి అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల తరువాత మళ్లీ కేరళలో మంచి మార్కెట్ ఉంది. పుష్ప సినిమాతో నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని కూడా అల్లు అర్జున్ ని కూడా అల్లు అర్జున్ ఆకట్టుకున్నారు. నార్త్ ఇండియా నుంచి ఆయనకు ఇన్ స్ట్రాగ్రామ్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. పుష్ప సినిమాకి ముందు 16 మిలియన్లుగా ఉన్న అల్లు అర్జున్ ఇన్ స్ట్రాగ్రామ్ ఫాలోవర్లు.. ఇప్పుడు 20 మిలియన్లకు చేరారు. అల్లు అర్జున్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్లు సౌత్ ఇండియా నుంచి ఉండడం విశేషం. కాజల్ అగర్వాల్ కి ఇన్ స్టాలో 24.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సమంతను 24.8 మిలియన్ యూజర్లు ఫాలో అవుతున్నారు. అలా వైకుంఠపురం చిత్రంలో బన్నీకి జంటగా నటించిన పూజా హెగ్దేకి ఇన్ స్టాగ్రామ్ లో 22.7 మిలియన్ ఫాలోవర్లు ఉండటం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్ సైతం 22.9 మిలియన్ ఫాలోవర్లున్నారు.  

Advertisement

Also Read :  మంచువారింట మొద‌లైన పెళ్లి సంద‌డి…హ‌ల్దీ పిక్స్ వైర‌ల్..!

సౌత్ హీరోల విషయానికొస్తే.. కేజీఎఫ్ హీరో యశ్ కి 13.4 మిలియన్ ఫాలోవర్లున్నారు. తెలుగులో రామ్ చరణ్ కి 12.4 మిలియన్ ఇన్ స్టా ఫాలోవర్స్ ఉన్నారు. మహేష్ బాబుకి 9.7  మిలియన్, ప్రభాస్ కి 9.2 మిలియన్ , జూనియర్ ఎన్టీఆర్ కి 5.4 మిలియన్, చిరంజీవికి 2.1 మిలియన్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. వీరెవ్వరూ అల్లు అర్జున్ కి దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సీక్వెల్ పుష్ప 2 చిత్రీకరణలో ఉన్నారు. పుష్ప సినిమాకి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో పుష్ప 2 అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేవిధంగా సుకుమార్ పుష్ప 2 చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. అల్లు అర్జున్ సైతం మరే ప్రాజెక్ట్ వైపునకు వెళ్లకుండా పూర్తిగా ఈ చిత్రంపైనే దృష్టి పెట్టారు. ఈ చిత్రం తరువాత వరుసగా కొత్త ప్రాజెక్ట్ లను బన్నీ పట్టాలెక్కించనున్నారు.  

Also Read :  తుదిశ్వాస వ‌ర‌కూ నిన్నే ప్రేమిస్తా…. తార‌క‌ర‌త్న భార్య రాసిన‌ లేఖ వైర‌ల్..!

Visitors Are Also Reading