Home » నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. తెలంగాణ‌లో మ‌రో నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. రూ.ల‌క్ష‌కు పైగా వేత‌నం..!

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. తెలంగాణ‌లో మ‌రో నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. రూ.ల‌క్ష‌కు పైగా వేత‌నం..!

by Anji
Ad

తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల భారీగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు జారీ చేస్తున్న విష‌యం తెలిసిన‌దే. ఇప్ప‌టికే పోలీస్ రిక్రూట్‌మెంట్ కోసం ధ‌రఖాస్తుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ ముగిసింది. ఈనెల‌లోనే ప్రిలిమ్స్ ప‌రీక్ష కూడా జ‌రుగ‌నుంది. అదేవిధంగా టీచ‌ర్ పోస్ట్ ల భ‌ర్తీలో భాగంగా టెట్ కూడా నిర్వ‌హించారు. ఇక గ్రూప్ -1 నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా టీఎస్‌పీఎస్సీ మ‌రొక నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. ర‌వాణా విభాగంలో ఉన్న ఖాళీలు భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్ని..? అర్హ‌త ఏంటి..? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement


నోటిఫికేష‌న్ లో భాగంగా మొత్తం 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్ట‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది టీఎస్‌పీఎస్సీ. ఖాళీగా ఉన్న ఈ పోస్టుల‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకునే వారు మోకానిక‌ల్ ఇంజినీరింగ్‌, ఆటో మొబైల్ ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లోమా ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. వీటితో పాటు వాలిడ్ హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ క‌లిగి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 01-07-2022 నాటికి 21-39 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. వివిధ కేట‌గిరి వారికి మిన‌హాయింపు ఉంటుంది.

Advertisement


ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.45,960 నుంచి రూ.1,24,150 వ‌ర‌కు వేత‌నం చెల్లిస్తారు. ఇక ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ 05 ఆగ‌స్టు, 2022న ప్రారంభ‌మై 05 సెప్టెంబ‌ర్, 2022తో ముగియ‌నుంది.

Also Read : 

భ‌ర్త‌లు చేసే ఈ త‌ప్పుల వ‌ల్లే భార్య‌ల‌కు అనారోగ్యాలు వ‌స్తాయట‌…!

Sr.NTR Family: నంద‌మూరి కుటుంబంలో విషాదం.. !

Visitors Are Also Reading