Home » వివేకానందరెడ్డి కేసులో తెరపైకి మరో పేరు.. ఇంతకు ఆ మహిళ ఎవరు?

వివేకానందరెడ్డి కేసులో తెరపైకి మరో పేరు.. ఇంతకు ఆ మహిళ ఎవరు?

by Anji
Published: Last Updated on
Ad

మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ కేసులో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ లో కీలక అంశాలు బయటకి వచ్చాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి రెండో భార్య కొడుకును వారసుడిగా ప్రకటించే ప్రక్రియలో ఆయన హ* జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2010లో షేక్ షమీమ్ అనే మహిళను వివేకానందరెడ్డి పెళ్లి చేసుకున్నారని.. రెండో పెళ్లితో ఆయన కూతురు సునితతో సంబంధాలు కూడా దెబ్బతిన్నట్టు వివరించారు. 

Also Read :  నరేష్-పవిత్ర పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. అదంతా పెద్ద డ్రామా ? 

Advertisement

 

వివేకా-షమీమ్ కి 2015లో ఓ కుమారుడు జన్మించాడు. తమ కుటుంబం నుంచి దూరంగా ఉండాలంటూ సునీత బెదిరించింది. సీబీఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో షమీమ్ ఈ విషయాన్ని చెప్పింది. రెండో పెళ్లి తరువాత వివేకానందరెడ్డి చెక్ పవర్ ని తొలగించారు. సునిత, వివేక సతీమణి హైదరాబాద్ లో ఉంటే.. వివేకానందరెడ్డి మాత్రం పులివెందులలో ఒంటరిగానే ఉండేవారు. షమీమ్ కి పుట్టిన కుమారుడిని వారసుడిగా ప్రకటిస్తారనే జరిగిన నేపథ్యంలో ఈ హ* జరిగి ఉండవచ్చు. వివేకానందరెడ్డి చనిపోయిన తరువాత నిందితులు ఇంట్లో డాక్యుమెంట్ల కోసం వెతికినటట్టు షమీమ్ చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతుంది అని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 

Also Read :  ఆ ఒక్క సినిమాతో అంతమంది దర్శకులు పరిచయం కానున్నారా..? 

Advertisement

“ఇక ఇన్ని రోజులు నేను చాలా మౌనంగా ఉన్నాను. వైఎస్సార్ సీపీ క్యాడర్ తనను ప్రశ్నిస్తోంది. ఇక నుంచి నేను మాట్లాడడం ప్రారంభిస్తాను. ముస్లిం మహిళకు పుట్టిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వివేకానందరెడ్డి నిర్ణయించుకున్నారు.  ఆయన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నారు. ఇక ఈ ఆస్తులన్నీ వారికి వెళ్లిపోతాయని.. రాజకీయ వారసులుగా వస్తారని, సునితమ్మ భర్త రాజశేఖర్ కుట్ర చేసి ఉంటారని నా అనుమానం. హ* జరిగిన ప్రాంతంలో లెటర్ ని మాయం చేశారు. నేను ఎక్కడ కూడా గుండెపోటు అని చెప్పలేదు” అని అవినాష్ రెడ్డి స్పష్టం చేసారు. 

Also Read :   ఈ 3 లక్షణాలు మీలో ఉన్నాయా… అయితే గుండెపోటు వచ్చే ప్రమాదం పక్కా!

Manam News

సీబీఐ విచారణ వ్యక్తి టార్గెట్ గా జరుగుతోంది. అప్రూవర్ గా మారిన వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలోనే ఇది అంతా ఉంది. ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారణ జరపడం లేదు. “నేను గుండెపోటు అని చెప్పినట్టు టీడీపీ వారు చిత్రీకరించారు. కుటుంబ సభ్యులు చెబితేనే తాను అక్కడికి వెళ్లాను. ఆ తరువాత పోలీసులకు, ఇతర బంధువులకు, ముఖ్య నాయకులకు ఫోన్ చేశాను. నా సోదరి సునితమ్మ హైకోర్టులో, సుప్రీకోర్టులో పలు ఆరోపణలు చేసింది. ఏ ఒక్క రోజు కూడా నేను ఎవరి గురించి మాట్లాడలేదు. నేను కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే.. సీబీఐ అధికారులు సునితమ్మకి సమాచారం ఇస్తున్నారు” అని వెల్లడించారు అవినాష్ రెడ్డి. 

Also Read :  ఈ 3 నియమాలతో మీ తెల్ల జుట్టు మాయమవ్వడం పక్కా..!

Visitors Are Also Reading