Home » అల్లు అర్జున్ బోయ‌పాటి కాంబోలో మ‌రో సినిమా

అల్లు అర్జున్ బోయ‌పాటి కాంబోలో మ‌రో సినిమా

by Bunty

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మొద‌టి పార్ట్ విడుద‌ల అయి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అలాగే వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో పుష్ప పార్ట్ టూ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా తీస్తాడో అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం అల్లు అర్జున్ త‌ర్వాతి సినిమా ఖ‌రారు అయిన‌ట్టు ఫీల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం బోయపాటి శ్రీ‌ను భారీ యాక్ష‌న్ స్క్రీప్ట్ రెడీ చేశాడ‌ని తెలుస్తుంది. ఆ యాక్ష‌న్ స్క్రీప్ట్ కు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు సమాచారం.

ఈ సినిమా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో ప‌ట్టాల పైకి ఎక్క‌నుంద‌ని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా రెంజ్ లో రూపొందుస్తున్న‌ట్టు స‌మాచారం. అలాగే ఈ సినిమా కు నిర్మాతగా అల్లు అర్జున్ వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని తెలుస్తుంది. కాగ బోయ‌పాటి శ్రీ‌ను బాల‌య్య కాంబినేష‌న్ లో వ‌చ్చిన అఖండ సినిమా భారీ హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. ఈ మ‌ధ్య ఆ సినిమా రూ. 100 కోట్ల క్ల‌బ్ లో చేరింది. అలాగే అల్లు అర్జున్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ ఇది వ‌ర‌కు వ‌చ్చిన స‌రైనోడు సూప‌ర్ హిట్ కొట్టింది. అలాంటి హిస్ట‌రీ ని మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్ రిపీట్ చేస్తాందో లేదో చూడాలి.

Visitors Are Also Reading