Ad
భారత జట్టుకు ఈ మధ్య కాలంలో కెప్టెన్లు తెగ మారుతున్న విషయం తెలిసిందే. సిరీస్ కు లేదా ఓ టూర్ కు అన్నవిధంగా కెప్టెన్లను మారుస్తుంది బీసీసీఐ. అయితే ఈ ఏడాది జులైతో కలుపుకొని ఏడూ నెలలు కాగా భారత జట్టుకు కెప్టెన్సీ కూడా ఏడుగురు చేసారు. అయితే ఇప్పుడు భారత జట్టుకు మూడు ఫార్మట్స్ లో పూర్తి స్థాయి కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. రోహిత్ కు రెస్ట్ ఇవ్వడం లేదా.. అతను గయా పడటం లేదా ఇంకో కారణం వల్ల కావచ్చు కానీ కెప్టెన్లను మారుస్తూ పోతుంది భారత జట్టు. ఈ 2022 లో మొత్తం ఇప్పటివరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిహాబ్ పంత్, శిఖర్ ధావన్, బుమ్రా, హార్దిక్ పాండ్య ఇలా వీరంత కెప్టెన్సీ అనేది చేసారు.
అయితే ఈ మధ్యే ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకున్న టీం ఇండియా నేడు వెస్టిండీస్ జట్టుతో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వన్డే సిరీస్ అనేది ఆడుతుంది. అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 సిటీస్ అనేది ఆడుతుంది. ఇక్కడితో ఈ పర్యటన ముగిసిన తర్వాత మళ్ళీ జింబాంబ్వే పర్యటనకు వెళ్తుంది టీం ఇండియా. అయితే ఈ పర్యటన నుండు కూడా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి అనేది ఇవ్వనుంది బీసీసీఐ. ఎందుకంటే.. ఆ తర్వాత వెంటనే ఆసియా కప్ ఉండటం.
ఇక రోహిత్ ఈ పర్యటనకు వెళ్లకపోతే ఇంకో కెప్టెన్ ఉండాల్సిందే. అయితే ఇది వన్డే సిటీస్ కావడంతో మళ్ళీ అందరూ శిఖర్ ధావన్ కే కెప్టెన్సీ ఇస్తారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న తాజాగా సమాచారం ప్రకారం…. ఈ జింబాంబ్వే పర్యటనలో భారత జట్టుకు మరో కెప్టెన్ రానున్నట్లు తెలుస్తుంది. ఈ టూర్ కు ధావన్ ను పంపించకూడదు అని డిసైడ్ అయిన బీసీసీఐ.. శ్రేయర్ అయ్యర్ లేదా సంజూ సాంసన్ లో ఎవరో ఒక్కరికి కెప్టెన్సీ ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఈ జింబాంబ్వే పర్యటనలో టీం ఇండియా కెప్టెన్ ఎవరు అనేది.
ఇవి కూడా చదవండి :
ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ ఎన్ని కోట్లు ఛార్జ్ చేస్తాడో తెలుసా..?
స్పాన్సర్లతో చుక్కలు చూస్తున్న బీసీసీఐ..!
Advertisement