Home » “అన్నవరం” సినిమాలో పవన్ చెల్లెలు గుర్తుందా…? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా…?

“అన్నవరం” సినిమాలో పవన్ చెల్లెలు గుర్తుందా…? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా…?

by AJAY

ఒకప్పుడు హీరోయిన్ లుగా రాణించిన చాలామంది ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అలాంటి హీరోయిన్ లలో హీరోయిన్ సంధ్య కూడా ఒకరు. నిజానికి సంధ్య తమిళ సినిమా ప్రేమిస్తే లో హీరోయిన్ గా నటించింది. భరత్ హీరోగా నటించిన ఈ సినిమాలో సంధ్య హీరోయిన్ గా నటించగా ఈ చిత్రం తమిళ తెలుగు భాషల్లో విడుదల అయింది.

తెలుగులోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎమోషనల్ లవ్ స్టోరీ కి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ సినిమా హీరోయిన్ కు సైతం ఎంతో పాపులారిటీ వచ్చింది. దాంతో తెలుగులోను సంధ్య ఆఫర్ లను అందుకుంది. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ కు చెల్లెలుగా నటించింది.

అన్ని భాషల్లో కలిపి మొత్తం 40 కి పైగా సినిమాలలో నటించింది. చాలా సినిమాలలో నటించిన సంధ్య ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి అర్జున్ ను 2015 లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సంధ్య సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది. ఇక ఇటీవల సంధ్య అర్జున్ దంపతులకు ఓ కూతురు కూడా జన్మించింది. అయితే సినిమాలకు దూరమైన చాలా మంది హీరోయిన్ లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కానీ సంధ్య సోషల్ మీడియాలో కూడా కల్పించడం లేదు.

Also read : బాలయ్యకు బిగ్‌ షాక్‌..అన్నపూర్ణ స్టూడియోస్ లోకి నో ఎంట్రీ….!

Visitors Are Also Reading