Home » రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా వెంక‌టేష్ హీరోయిన్..!

రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా వెంక‌టేష్ హీరోయిన్..!

by AJAY
Ad

ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న రామ్ చ‌ర‌ణ్ త‌ర‌వాత సినిమా శంక‌ర్ తో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే శంకర్ తో చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ కూడా మొద‌ల‌య్యింది. ఈ సినిమాను పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నార‌ట‌.

Advertisement

Advertisement

అంతే కాకుండా తండ్రి మ‌రియు త‌న‌యుడి పాత్ర‌ల‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తుండ‌గా త‌న‌యుడి పాత్రలో హీరోయిన్ గా కియారా అద్వాని న‌టించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తండ్రి పాత్ర ప‌క్క‌న హీరోయ‌న్ గా అంజ‌లి న‌టించే ఛాన్స్ ఉన్న‌ట్టు టాలీవుడ్ లో టాక్ న‌డుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 30శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రాజ‌మండ్రి లో షూట్ త‌ర‌వాత గ్యాప్ ఇవ్వగా ఇప్పుడు మ‌ళ్లీ అక్క‌డ నుండే షురూ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుండి ఓ పోస్ట‌ర్ బ‌య‌ట‌కు రాగా అందులో చ‌ర‌ణ్ ఓల్డ్ లుక్ లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.

Visitors Are Also Reading