Home » హీరోయిన్ అంజలా జవేరీ భర్త మనకు తెలిసిన నటుడే.. అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

హీరోయిన్ అంజలా జవేరీ భర్త మనకు తెలిసిన నటుడే.. అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Published: Last Updated on
Ad

అంజలా జవేరి.. ఈ బ్యూటీ నార్త్ తో పాటు సౌత్ ప్రేక్షకులకు సుపరిచితమే. తొలుత ఈమె హిమాలయ్ పుత్ర అనే బాలీవుడ్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక మన టాలీవుడ్ లోకి విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ప్రేమించుకుందాం రా! తో పరిచయం అయింది. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత చిరంజీవితో చూడాలని ఉంది, బాలయ్యతో సమరసింహారెడ్డి, భలేవాడివి బాసు, నాగార్జునతో రావోయి చందమామ, శ్రీకాంత్ తో ప్రేమసందడి వంటి సినిమాల్లో నటించింది.ఈ అమ్ముడు తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. 

Advertisement

ఇంతలా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న అంజలా జవేరీ పెళ్లి తరువాత సినిమాలకు దూరం అయింది. మధ్యలో అడపదడప సినిమాలో కనిపిస్తుంటూ వచ్చింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ అనే సినిమాతో మళ్లీ తెరపై ఫుల్ లెన్త్ రోల్ కనిపించింది. ఇక్కడ ఓ విశేషం ఉంది. ఆమె భర్త కూడా మనకు బాగా తెలిసిన టాలీవుడ్ నటుడే. ఈమె భర్త కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అనేది చాలా మందికి తెలియదు. అతను ఎవ్వరో కాదు.. బాలీవుడ్ నటుడు తరుణ్ రాజ్ అరోరా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 మూవీతో మోడ్రన్ విలన్ గా టాలీవుడ్ తరుణ్ అరోరా పరిచయమయ్యారు. ఆ సినిమాలో తనదైన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Advertisement

ఆ తరువాత కాటమరాయుడు, జయజయజానకి నాయక, అర్జున్ సురవరం, వంటి సినిమాల్లో కూడా విలన్ గా నటించాడు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తరుణ్ అరోరా అంజలా జవేరి కంటే ఏడేళ్లు చిన్నవాడు. అయినప్పటికీ వీరిద్దరి మనస్సులు కలవడంతో కొద్ది రోజుల పాటు డేటింగ్ చేసి చివరికీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి దాదాపు ఆరేళ్లు అయినప్పటికీ పిల్లలు లేరట. పరస్పర అంగీకారంతోనే తరుణ్ అరోరా, అంజలా జవేరీ పిల్లలను వద్దనుకున్నారట. పెళ్లి తరువాత అంజలా జవేరి నటనకు దూరమైంది. ఆమె భర్త మాత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతున్నాడు. తగిన కథ, పాత్ర వస్తే.. వెంటనే ఆ సినిమాకి  ఓకే చెప్పనున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అంజలా జవేరీ.

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

జూనియర్ ఎన్టీఆర్ విషయంలో రామానాయుడు కోరిక ఇది.. మరి నెరవేరుతుందా..?

చిరు “భోళా శంకర్” మూవీ ని ఆ “ఎన్టీఆర్” సినిమాల నుంచి కాపీ కొట్టారా? టీజర్ లో ఇవి గమనించారా?

మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వం చేసిన సినిమాలేవో మీకు తెలుసా..?

Visitors Are Also Reading