Home » తెలుగులో అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న మూడు అప్ కమింగ్ సినిమాలు ఇవే…!

తెలుగులో అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న మూడు అప్ కమింగ్ సినిమాలు ఇవే…!

by AJAY
Ad

తన టాలెంట్ తో అనిరుధ్ రవిచంద్రన్ చిన్నవయసులోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొలవరిడి పాట తో అనిరుధ్ యూట్యూబ్ ను షేక్ చేశాడు. ఆ తరవాత ఎన్నో సూపర్ హిట్ పాటలు అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. తెలుగులో కొన్ని సినిమాలకు పని చేసినా తమిళ్ లో వచ్చిన క్రేజ్ ఇక్కడ రాలేదు. రీసెంట్ గా విజయ్ హీరోగా నటించిన బీస్టు సినిమాకు స్వరాలు సమకూర్చాడు.

Advertisement

Advertisement

ఇప్పటికే ఈ సినిమా పాటలు విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అనిరుద్ తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ 30కి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ఫిక్స్ అయ్యాడు. అంతే కాకుండా రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా కు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ దాదాపుగా ఖరారు అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ సమంత కలిసి ఓ సినిమా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు కూడా అనిరుధ్ దాదాపుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇక వరుస ఆఫర్ లు వస్తున్న నేపథ్యంలో అనిరుధ్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో చూడాలి.

Visitors Are Also Reading