Home » Animal Review : ‘యానిమల్’ మూవీ రివ్యూ….మరో అర్జున్‌ రెడ్డినే !

Animal Review : ‘యానిమల్’ మూవీ రివ్యూ….మరో అర్జున్‌ రెడ్డినే !

by Bunty
Ad

Animal Review : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించి.. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం యానిమల్. ఈ సినిమా ట్రైలర్ తోనే అంచనాలు అమాంతం పెంచేసింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై సందీప్ రెడ్డి ఆవిష్కరించారు.

animal-movie-review

Advertisement

కథ మరియు వివరణ :

రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘యానిమల్’ మూవీ కథ విషయానికి వస్తే…. సందీప్ రెడ్డి వంగ ఈ కథని ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ రివిల్ చేసేసాడు. ఇది తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా. ముఖ్యంగా కొడుకుకి తండ్రి అంటే పిచ్చి ప్రేమ ఉన్నప్పుడు ఆ కొడుకు తండ్రి కోసం ఏం చేశాడు అనేదే ఈ సినిమా. అనిల్ కపూర్ నీ చంపడానికి చూసిన కొద్దిమంది వ్యక్తులను రణబీర్ కపూర్ ఎలా చంపాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక నార్మల్ గా చూస్తే ఇది చిన్న పాయింట్ అయినప్పటికీ ఈ సినిమాలో ప్రతి ఎమోషన్ ని కూడా ఆడియన్స్ పీక్ స్టేజ్ లో ఎంజాయ్ చేసే విధంగా సందీప్ దీన్ని మలిచాడు.

 

అనిల్ కపూర్, రణబీర్ కపూర్ మధ్యన జరిగే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. స్కూల్ పిల్లాడి నుంచి కాలేజ్ అబ్బాయి, లవర్ బాయ్, గ్యాంగ్ స్టార్ అలా హీరో జీవితానికి సంబంధించిన అన్ని దశలు ఈ సినిమాలో క్లియర్ కట్ గా చూపించారు. సందీప్ రెడ్డి వంగ చెప్పినట్లుగానే మూడున్నర గంటల సినిమాలో ఎక్కడ ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వలేదట. ఇక ఈ సినిమాకు ఓన్లీ ఫర్ అడల్ట్ సర్టిఫికెట్ వచ్చిన సంగతి తెలిసిందే. వైలెన్స్, రొమాన్స్, ఫుల్ లాంగ్వేజ్ లిమిట్స్ కు మించి ఉండడంతో ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్.

Advertisement

ప్లస్ పాయింట్స్ :

యాక్షన్ సీన్స్‌
రణబీర్ కపూర్
సందీప్ రెడ్డి
ఎమోషన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

కథ ల్యాగ్‌
కామెడీ మిస్సింగ్‌

రేటింగ్ : 2.5/5

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading