Home » ఏపీలో అంగన్వాడీ పోస్టులు…7వ తరగతి పాస్ అయితే చాలు

ఏపీలో అంగన్వాడీ పోస్టులు…7వ తరగతి పాస్ అయితే చాలు

by Bunty
Ad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి… అనేక సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. పేద కులాల నుంచి ధనిక కులాల వరకు అందరికీ సహాయం అందేలా పథకాలను క్రియేట్ చేశాడు జగన్. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కింద శ్రీకాకుళం జిల్లా అంగన్వాడి కేంద్రాల్లో 123 అంగన్వాడి వర్కర్,మినీ అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక గ్రామానికి చెందిన వివాహితులైన మహిళలు మాత్రమే అర్హులు. పోస్టును బట్టి తప్పనిసరిగా 7వ తరగతి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు మే 25, 2023వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయంలో నేరుగా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ అందజేయవచ్చు. అంగన్వాడి కార్యకర్తల పోస్టులకు టెన్త్ లో వచ్చిన మార్కులు, వయసు ఆధారంగా ఎంపిక చేస్తారు.

Advertisement

అంగన్వాడి సహాయకులు/మినీ అంగన్వాడి కార్యకర్తల పోస్టులకు ఏడో తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే గ్రామ స్థానికత, మున్సిపాలిటీ పరిధిలో వార్డు స్థానికతల ప్రాతిపాదికన ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి అంగన్వాడి వర్కర్ పోస్టులకు నెలకు రూ. 11, 500లు, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులకు నెలకు రూ. 7000, అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ లకు నెలకు రూ. 7వేల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Virupaksha : నల్ల కోడి ఎత్తుకుపోయేది క్షుద్ర పూజలకేనని ముందే హింట్ ఇచ్చిన దర్శకుడు

టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

Kajal Aggarwal : టాలీవుడ్ హీరో చేతిలో మోసపోయిన కాజల్?

Visitors Are Also Reading