Home » ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..!

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..!

by Bunty
Ad

ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది అక్కడి ప్రభుత్వం. వచ్చే ఏడాది ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే,  ఏపీ నుంచి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం పోస్టులు 80 ఖాళీగా ఉన్నాయి. వీటిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 20, అంగన్వాడి హెల్పర్ పోస్ట్లు 60 ఉన్నాయి. అంగన్వాడి కార్యకర్త పోస్టులకు నెలకు రూ. 11,500 చెల్లిస్తారు. హెల్పర్ పోస్ట్ లకు రూ.7000 చెల్లించనున్నారు.

Advertisement

 

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయో పరిమితులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్థులు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా ఏ గ్రామ పరిధిలో ఈ పోస్టు ఖాళీగా ఉందో ఆ సొంత పంచాయతీ నందు నివసిస్తూ ఉండాలి. వివాహితులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

దీనికోసం అభ్యర్థులు https://ananthapuramu.ap.gov.in/ వెబ్సైట్ సందర్శించి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లోనే నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ డిసెంబర్ 16, 2022న విడుదల అయింది. నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోగా అభ్యర్థులు దరఖాస్తులను అనంతపురం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారిక పంపించాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తులను డిసెంబర్ 24 లోపు పంపించాలి. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంకు కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్ వంటి డాక్యుమెంట్స్ ల జిరాక్స్ పత్రాలను జత చేయాలి.

READ ALSO : చిరంజీవి ఆస్తి విలువ ఎంతో తెలుసా..?రాజకీయాల కారణంగా నష్టపోయారా !

Visitors Are Also Reading