తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందం అభినయంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది హీరోయిన్ సిమ్రాన్. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే మంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మొదటిసారిగా సుమన్ హీరోగా వచ్చిన అబ్బాయి గారి పెళ్లి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ ఒక్క చిత్రంతోనే తన అంద చందాలతో నటన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా సమరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా చేసింది.
also read:April 4th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!
Advertisement
ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో, ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ తో కలిసుందం రా, నాగార్జునతో నువ్వొస్తావని, బాలకృష్ణతో నరసింహా నాయుడు, చిరంజీవితో డాడీ, హరికృష్ణతో సీతయ్య, లాంటి సూపర్ హిట్ సినిమాలు నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అప్పట్లో సిమ్రాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇక తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్,మలయాళం ఇండస్ట్రీలలో కూడా చాలా చిత్రాలు చేసింది.
Advertisement
also read:Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్
తన కెరియర్ ఫిక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ ను 2003లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ కొనసాగుతూ వచ్చిన సిమ్రాన్ కొన్ని రోజులకు హీరోయిన్ గా చేయడం ఆపేసింది. కొన్ని సినిమాల్లో స్కోప్ ఉన్న పాత్రలైతే అప్పుడప్పుడు నటిస్తూ వస్తోంది. అలా ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, ఇండస్ట్రీలను తన అంద, చెందాలతో ఊపు ఊపిన సిమ్రాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
also read:IPL 2023 : సిక్సుతో కారు ధ్వంసం..గైక్వాడ్ కు రూ.5 లక్షల రివార్డు