Home » బిగ్ బాస్ ఓటిటి కోసం మరో కాంటెస్టెంట్.. ఇప్పటివరకూ ఎవరెవరు ఫైనల్ అయ్యారంటే..?

బిగ్ బాస్ ఓటిటి కోసం మరో కాంటెస్టెంట్.. ఇప్పటివరకూ ఎవరెవరు ఫైనల్ అయ్యారంటే..?

by AJAY
Ad

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 పూర్తయి వారం రోజులు గడుస్తోంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ ఓటిటి ప్రారంభమవుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ ఓటిటికి కూడా తానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్టు నాగార్జున స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ప్రతి సీజన్ కి ముందు కంటెస్టెంట్ ల కోసం నిర్వాహకులు కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి అందులో నచ్చిన వారిని ఫైనల్ చేస్తారు. అయితే బిగ్ బాస్ ఓటిటి కోసం కూడా కంటెస్టెంట్ ల ఎంపిక ఇప్పటికే ప్రారంభమైనట్టు సమాచారం.

Anchor shiva

Anchor shiva

అంతేకాకుండా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ శివను ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా డి డాన్స్ షో విన్నర్ రాజు కూడా బిగ్ బాస్ లోకి వస్తారని సమాచారం అందుతోంది.

Advertisement

Advertisement

Dhe raju

Dhe raju

అదేవిధంగా తాజా సమాచారం ప్రకారం మరో కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ ఓటిటి ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు జబర్దస్త్ కామెడీ షో లో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్ వర్షినిని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్టు సమాచారం.

Anchor varshini

Anchor varshini

యాంకర్ వర్షిని గ్రీన్ సిగ్నల్ ఇస్తే మూడో కంటెస్టెంట్ గా వర్షిని పేరు ఖరారైనట్టే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే బిగ్ బాస్ ఓటిటిని హిందీలో పరిచయం చేశారు. అక్కడ మంచి సక్సెస్ అవడంతో తెలుగులోనూ ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న బిగ్ బాస్ సెట్ లో కొన్ని మార్పులు చేసి మరో రెండు నెలల్లోనే బిగ్ బాస్ ఓటిటిని ప్రారంభించే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారు. అంతే కాకుండా హాట్ స్టార్ లో ఈ షోను ప్రసారం చేయనున్నారు. మరి బిగ్ బాస్ ఓటిటి ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Visitors Are Also Reading