Home » పెళ్లి చేసుకోమ‌ని అడిగిన‌వాళ్ల‌కు యాంక‌ర్ వ‌ర్షిణి స్ట్రాంగ్ కౌంట‌ర్..!

పెళ్లి చేసుకోమ‌ని అడిగిన‌వాళ్ల‌కు యాంక‌ర్ వ‌ర్షిణి స్ట్రాంగ్ కౌంట‌ర్..!

by AJAY
Ad

బుల్లితెర‌పై పాపులారిటీ సంపాదించుకున్న భామ‌ల్లో యాంక‌ర్ వ‌ర్షిణి కూడా ఒక‌రు. ఎన్నో టీవీ షోల‌లో సందడి చేసి యాంక‌ర్ వ‌ర్షిణి అభిమానుల‌ను సంపాదించుకుంది. అయితే ఆ త‌ర‌వాత సినిమా అవ‌కాశాలు రావ‌డంతో పూర్తిగా వ‌ర్షిణి బుల్లితెర‌కు దూర‌మైంది. కేవ‌లం సినిమాలు మాత్రమే చేసింది. రీసెంట్ గా సుమంత్ హీరోగా న‌టించిన మ‌ళ్లీ మొద‌లైంది సినిమాలో యాంక‌ర్ వ‌ర్షిణి ముఖ్య‌మైన పాత్రలో న‌టించింది.

Anchor varshini

Anchor varshini

అంతే కాకుండా స‌మంత హీరోయిన్ న‌టించిన శాకుంత‌లం సినిమాలో కూడా యాంక‌ర్ వ‌ర్షిణి ముఖ్య‌మైన పాత్రలో న‌టించిన‌ట్టు తెలుస్తోంది. అయితే బుల్లితెర‌పై ఫామ్ లో ఉన్న స‌మ‌యంలో సినిమాల వైపు అడుగులు వేసిన బ్యూటీ ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న‌ట్టు కనిపిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో యాంక‌ర్ వ‌ర్షిణి నానా హంగామా చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోల‌తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్ల‌ను ప‌రిగెట్టిస్తుంది.

Advertisement

Advertisement

అంతే కాకుండా వీడియోల‌తో మ‌తి పోగొడుతూ ఉంటుంది. ఇదిలా ఉండ‌గా తాజాగా యాంక‌ర్ వ‌ర్షిణిని పెళ్లి గురించి ఎవ‌రు అడిగారో ఏమోగానీ కౌంట‌ర్ ఇచ్చి ప‌డేసింది. 26 ఏళ్లు ఇంకా పెళ్లి చేసుకోలేదా అని సొసైటీ అడుగుతుంది. కానీ మ‌నం 2022 లో ఉన్నాం ఇంకా ప‌క్క‌వాళ్ల గురించి ప‌ట్టించుకోవడం అవ‌స‌ర‌మా అని నాకు అనిపిస్తుంది అంటూ కౌంట‌ర్ ఇచ్చింది.

ఇదిలా ఉండ‌గా గతంలో యాంక‌ర్ వ‌ర్షిణికి ఎంగేజ్మెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కానీ ఏవో కార‌ణాల వ‌ల్ల ఆ ఎంగేజ్మెంట్ పెళ్లి వ‌ర‌కూ వెళ్ల‌లేదు. మ‌రోవైపు గ‌తంలో యాంక‌ర్ వ‌ర్షిణి హైప‌ర్ ఆది మ‌ధ్య ఏదో ఉందంటూ కూడా గాసిప్పులు వినిపించాయి. కానీ అవి కూడా కేవ‌లం షో కోసం వేసిన స్టంట్ లే అని అర్థం అయిపోయింది.

Visitors Are Also Reading