Home » తీవ్రంగా ఎమోషన్ అయిన యాంకర్ సుమ.. కారణం తెలిస్తే..?

తీవ్రంగా ఎమోషన్ అయిన యాంకర్ సుమ.. కారణం తెలిస్తే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ లు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు సుమ. ఆమె మైకు పట్టిందంటే చాలు స్టేజ్ పై నవ్వులు విరబూయాల్సిందే. ఎప్పుడు కూడా క్షణం తీరిక లేకుండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, వివిధ షోలు,ఈవెంట్లు చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి పలు కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విధంగా ఎంత బిజీగా ఉన్నా సుమ మాత్రం సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇదంతా సుమా కు ఒక వైపు కోణం అయితే ఆమె గురించి మనకు తెలియని మరో కోణం కూడా ఉంది. ఆమె టైమంటే టైమే. తను చెప్పిన టైంకి వస్తుంది.. ఒక్క నిమిషం అటూ ఇటూ కూడా కాదు.

Advertisement

 

కానీ సుమ ప్రోగ్రాం కి రావాలంటే ఆమె అడిగినంత ఇవ్వాల్సిందే. అంత డిమాండ్ ఉన్న యాంకర్ సుమ ప్రోగ్రాం లోకి ఎంటర్ అయింది అంటే ఎవరికి కూడా బోర్ కొట్టనివ్వదు. ఈ విధంగా సుమ రెండు చేతులా సంపాదిస్తుంది.. మరి ఇంత సంపాదిస్తున్న సుమ సహాయ కార్యక్రమాలు ఏమైనా చేస్తుందా అని అనుమానం మీకు వచ్చి ఉంటుంది. అయితే ఈ మధ్య సుమ చేసిన ఒక సహాయ కార్యక్రమం ఒక జీవితాన్ని నిలబెట్టిందనే విషయం అందరికీ అర్థమైంది. సుమ హోస్ట్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాం ప్రోమో తాజాగా యూట్యూబ్ లోకి వచ్చింది. ఇందులో పాత కమెడియన్స్ అంతా పాల్గొన్నారు. కృష్ణవేణి, జెన్నీ, అల్లరి ఫేమ్ సుభాషిని, బాలాజీ వంటి వారు వచ్చారు. ఇక వీరందరితో కలిసి యాంకర్ సుమ ఎంతో కామెడీ చేసింది.

Advertisement

ఈ ప్రోమో చివర్లో మాత్రం సుభాషిని చెప్పిన మాటలు వింటే అందరూ కన్నీళ్లు పెట్టారు. నేను ఈరోజు ఇక్కడ ఉండగలిగానంటే,ప్రాణాలతో బతికి ఉన్నానంటే దానికి కారణం సుమ అని చెప్పుకొచ్చింది. నాకు ప్రతి ఆరు నెలలకోసారి మందులు పంపిస్తుందని, ఆమె వల్లే నేను బ్రతికి ఉన్నాను అని, సుమ నా బంగారు తల్లి, వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు నా కడుపులో పుట్టాలి అంటూ ఎమోషనల్ అయింది సుభాషిని. దీంతో సుమ కూడా సుభాషినిని హత్తుకొని ఎమోషనల్ అయింది.

aslo read:

Visitors Are Also Reading