Telugu News » Blog » సుమ నోరు జారి అన‌సూయ‌ను కించ‌ప‌రిచిందా..?

సుమ నోరు జారి అన‌సూయ‌ను కించ‌ప‌రిచిందా..?

by Anji
Ads

కొన్ని విన‌డానికి విచిత్రంగా ఉండ‌డంతో పాటు న‌వ్వును కూడా తెప్పిస్తాయి. అలాంటి రెగ్యుల‌ర్‌గా టీవీ ప్రోగ్రామ్‌లను వీక్షించే వాళ్ల‌కు అర్థం అవుతుంది. మీరు యాంక‌ర్ సుమా హోస్ట్ చేసే క్యాష్ చూశారా..? ఎప్పుడైనా తోచిన సెల‌బ్రిటీల‌ను పిలిచి తోచిన ఆట‌ల్లా ఆడించి తోచిన హౌలా వేషాలు వేయించి ఇది ఏదీ తోచ‌క న‌వ్వ‌డం కోసం తవ్విన‌ట్టు న‌వ్వండిర భ‌య్ అని చెప్పుతుంది ఆమె. వాస్తవానికి సుమ నోరు కాస్త పెద్ద‌దే కానీ ఆమె అదుపులోనే ఉంటుంది. ఒక్క మాట తూల‌దు.

Ads
suma

suma

అస‌భ్యంగానో మ‌రొక విధంగానో అస‌లు ప‌లుక‌దు. చాలా సంయ‌మ‌నం పాటిస్తుంటుంది. కొన్నిసార్లు ఈ మ‌ధ్య శృతి త‌ప్పుతుంది సుమ‌. ఈటీవీ విడుద‌ల చేసిన ఓ ప్రోమో నే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. మాములుగా ఆమె తోటి ఆర్టిస్టుల ప‌ట్ల హీనంగా వ్య‌వ‌హ‌రించ‌దు. కానీ అక‌స్మాత్తుగా యాంక‌ర్ అన‌సూయ‌ను కించ‌ప‌రిచింది. చూసుకోలేదో లేక ఈటీవీ డిజిట‌ల్ ప్ర‌మోష‌న్ టీమ్‌కు అన‌సూయ ప‌ట్ల ఏమైనా అసూయ ఉందో తెలియ‌దు. కానీ ఆ టీజ‌ర్ య‌థావిధిగా యూట్యూబ్‌లో ఎడిట్ లేకుండా పెట్టింది. ఫిబ్ర‌వ‌రి 05న రాబోయే క్యాష్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో అది.

Also Read : తొలుత రాజ‌మౌళి ప్రారంభం.. ఇప్పుడు అంద‌రూ అదే పాటించ‌డం..!

Ads

ఈ మ‌ధ్య సినిమా వాళ్ల‌కు బ‌హిరంగ ప్ర‌మోష‌న్ యాక్టివిటి క‌న్నా టీవీ ప్రోగ్రామ్‌ల‌లోకి వెళ్లి ప్ర‌చారం చేసుకోవ‌డం అల‌వాటు అయింది. ఈ టీవీ షోల నిర్మాత‌ల‌కు నాలుగు డ‌బ్బులు వ‌స్తున్న‌యి క‌దా.. దీంతో సుమ కూడా లూజ‌ర్ వెబ్ సిరిస్ వాళ్ల‌ను పిలిచింది. వాళ్ల‌తో ఆటా పాటా, ప్రియ‌ద‌ర్శితో పాటు క‌ల్పిక అన్ని శ‌శాంక వ‌చ్చారు. అయితే ప్రియ‌ద‌ర్శికి త‌న బొమ్మ గీయ‌మ‌ని సుమ చెప్పింది. ప్రియ‌ద‌ర్శి నాలుగు పిచ్చి గీత‌ల‌ను గీసాడు. అది చూసి జ‌డుసుకున్న సుమ‌.. హమ్మో ఏమిటిది పుష్ప‌లో దాక్షాయ‌నిగా అనేసింది. అంటే ఆ పిచ్చి గీత‌ల మాదిరిగానే ఆ సినిమాలో దాక్షాయ‌ణి గెట‌ప్ ఉంద‌నే అర్థం వ‌చ్చింది. ఆ పాత్ర వేసింది తోటి యాంక‌ర్ అన‌సూయ‌. త‌న వ్యాఖ్య ఎటో త‌ప్పుగా వెళ్లిపోయింద‌నే సోయి కూడా సుమ‌లో క‌నిపించ‌లేదు. అంద‌రూ మాత్రం ప‌డి ప‌డి న‌వ్వారు.


వాస్త‌వ‌మే పుష్ప‌లో దాక్షాయ‌ని గెట‌ప్ బాగాలేదు. అస‌లు ఆమె పాత్ర‌కు పుష్ప చిత్రంలో పెద్ద ప్రాధాన్య‌త‌నే లేదు. దాక్షాయణి గెట‌ప్ మీద నెట్‌లో బోలెడు జోకులు, మీమ్స్ గ‌ట్రా న‌డుస్తూనే ఉన్న‌య్‌. అంతెందుకు అదే ఈటీవీలో సుడిగాలి సుధీర్‌, హైప‌ర్ ఆది కూడా పుష్ప స్పూపు చేసిన‌ప్పుడు దాక్షాయ‌ణి పాత్ర‌లో ఆడుకున్నారు. హైప‌ర్ ఆది శాంతి అనే లేడీ గెట‌ప్‌లో పోల్చాడు. అన‌సూయ ఉడుక్కుంది త‌ప్పేమీ అన‌లేక‌పోయింది. ఇప్పుడు సుమ ఇటీవ‌ల ఓ మ‌రాఠీ టీవీ స్పూఫ్ ఓ టీవీలో క‌నిపించింది. అందులో దాక్షాయ‌ణి గెట‌ప్ మ‌రి ఘోరం.. పాపం, అన‌సూయ‌.. నెటిజ‌న్లు అయితే ఫేస్‌బుక్ లైవ్‌లోకి వ‌చ్చేసి చెడామ‌డా తిట్టేస్తుంది. కానీ సుమ‌ను మాత్రం అన‌సూయ ఏమ‌న‌గ‌ల‌దు చెప్పండి.

Ad

Also Read : RadheShyam: రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కూడా వ‌చ్చేసింది..ఎప్పుడంటే!