Home » నా తండ్రితోనే పెళ్లి చేస్తున్నారు…పెళ్లి వార్త‌ల‌పై శ్రీముఖి ఫైర్..!

నా తండ్రితోనే పెళ్లి చేస్తున్నారు…పెళ్లి వార్త‌ల‌పై శ్రీముఖి ఫైర్..!

by AJAY
Ad

సినిమా తార‌లకు పెళ్లి అయ్యేవ‌ర‌కూ వారి పెళ్లి గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తూనే ఉంటాయి. అలాగే కొద్దిరోజులుగా యాంక‌ర్ శ్రీముఖి పెళ్లి గురించి కూడా వార్త‌లు గుప్పుమంటున్నాయి. శ్రీముఖి ఓ హైద‌రాబాదీని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అంతే కాకుండా అత‌డు ఓ వ్యాపార‌వేత్త అని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఆ వార్త‌ల‌పై యాంకర్ శ్రీముఖి తాజాగా స్పందించింది.

Advertisement

అంతే కాకుండా ఆ వార్త‌ల‌ను ఖండిస్తూ ప‌టాస్ బ్యూటీ ఫైర్ అయ్యింది. ఆ వార్త‌లు అన్నీ ఫేక్ అని తేల్చి చెప్పింది. ఎంత దారుణంగా త‌యార‌య్యారంటే నా తండ్రి ఫోటోల‌నే బ్ల‌ర్ చేసి థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. ఇది ఎంత ఘోరం..? ఈ రూమ‌ర్ లు వినీ వినీ అల‌సిపోయాను. ఇంకా నాకు ఎన్ని సార్లు పెళ్లి చేస్తారో అర్థం కావ‌డం లేదు. అంటూ శ్రీముఖి ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే శ్రీముఖి యాంక‌ర్ గా తెలుగులో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

సుమ‌, అన‌సూయ త‌ర‌వాత మ‌ళ్లీ అంత‌టి క్రేజ్ శ్రీముఖికి ఉంది. ఇ క శ్రీముఖి కేవ‌లం టీవీ షోల‌కు మాత్రమే కాకుండా సినిమా రిలీజ్ ఈవెంట్ ల‌కు సైతం హోస్ట్ గా చేస్తోంది. త‌న దైన పంచ్ ల‌తో పాటూ కామెడీ టైమింగ్ సొంతం అవ‌డంతో శ్రీముఖికి ఆఫ‌ర్ లు కూడా ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి. కేవ‌లం యాంక‌ర్ గానే కాకుండా శ్రీముఖి సినిమాల్లోనూ న‌టిస్తోంది. కానీ సినిమాల్లో మాత్రం పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేద‌నే చెప్పాలి.

Visitors Are Also Reading