Home » జబర్దస్త్ ను రిజెక్ట్ చేసిన శ్రీముఖి.. ఎందుకంటే…?

జబర్దస్త్ ను రిజెక్ట్ చేసిన శ్రీముఖి.. ఎందుకంటే…?

by Azhar
Ad

జబర్దస్త్ అనే కార్యక్రమం గురించి తెలుగు రాష్ట్రలో తెలియని ఎవరు వారు ఉండరు. 2013 లో ప్రారంభమైన ఈ కార్యక్రమం జనాలను ఇప్పటివరకు కూడా నవ్విస్తూనే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో జబర్దస్త్ రేటింగ్స్ అనేవి పడిపోయాయి. అందుకు కారణం ఈ షో నుండి పెద్ద పెద్ద కమెడియన్స్ వెళ్లిపోవడం. మంత్రిగా అవకాశం రావడంతో జడ్జ్ రోజా వెళ్లిపోగా.. ఆ తర్వాత సుధీర్, ఆది కూడా వెళ్లిపోయారు.

Advertisement

ఆ తర్వాత షో రెటైన్స్ అనేవి తగ్గిపోయాయి. ఇక ఈ మధ్యే తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి హోస్ట్ గా ఉన్న అనసూయ కూడా వెళ్ళిపోయింది. సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో అనసూయ జబర్దస్త్ నుండి వెళ్ళిపోయింది అని వార్తలు వచ్చాయి. కానీ ప్రజలు మాత్రం అది నమ్మలేదు. ఇక ఆమె ఎందుకు వెళ్ళిపోయినా కూడా ఆమె స్థానంలో వచ్చే కొత్త యాంకర్ ఎవరు అని ప్రజలు బాగా ఆలోచించారు.

Advertisement

ఇక అందులో భాగంగానే తెలుగులో మంచి పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖిని సంప్రదించారట జబర్దస్త్ యాజమాన్యం. కానీ శ్రీముఖి మాత్రం జబర్దస్త్ కు రావడానికి ఒప్పుకోలేదు. అందువల్ల చేసేది ఏం లేక ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ ఉన్న రష్మీనే జబర్దస్త్ కు కూడా యాంకర్ చేసారు. అయితే శ్రీముఖి ఈ షోను ఒప్పుకోకపోవడానికి.. రెమ్యునరేషన్ కారణం అని తెలుస్తుంది. ఆమే అడిగినంత ఇవ్వలేము జబర్దస్త్ యాజమాన్యం చెప్పడంతో శ్రీముఖి తప్పుకుంది అని సమాచారం.

ఇవి కూడా చదవండి :

వారు అంత గొప్పగా ఏం చేసారు…?

ఆసియా కప్ టోర్నీ జట్టును ప్రకటించిన బీసీసీఐ..!

Visitors Are Also Reading