యాంకర్ అనసూయ ఓ వైపు యాంకరింగ్‌తో పాటు మరొకవైపు నటనలోనూ దూసుకెళ్లుతుంది. ముఖ్యంగా ఆమె వయస్సు పెరిగే కొద్ది తన అందాల ప్రదర్శనను పెంచుతూ ఆకట్టుకుంటోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్తగా అలరించిన అనసూయ.. పుష్పలో దాక్షాయణి పాత్రతో దుమ్మురేపింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ పెద్దగ పేలకపోయినా.. రెండవ పార్ట్‌లో తగిన ప్రాధాన్యత ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ వెల్లడించారు. సుకుమార్ తీసిన రంగస్థలంలో అద్బుతమైన నటన కనబరచడంతో అప్పటి నుంచి అనసూయకు ఆఫర్లు భారీగానే వస్తున్నాయి.
anasuya family
ఇక బుల్లితెరపై అనసూయ సందడి అంతా ఇంతా కాదు. దీనికి తోడు అద్భుతమైన వాయిస్ ఆమె చేసే పలు కార్యక్రమాలు మంచి రేటింగ్స్‌తో దుమ్ము రేపుతున్నాయి. 30 ఏళ్లకు దాటి.. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా.. అనసూయ కుర్రహీరోయిన్లకు పోటీగా నటిస్తోంది. ఇక ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ముఖ్యంగా అనసూయ కళాశాలలో చదువుతున్నప్పుడు ఎన్సీపీ క్యాంపులో భర్త భరద్వాజ్ తో ప్రేమలో పడింది. ఆ తరువాత వీరి ప్రేమను పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు కలరు. కొద్ది రోజుల క్రితమే తన భర్త గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
తమది లవ్ మ్యారేజ్ అని చాలా మందికి తెలిసినా ఆమె భర్త ఎవరు..? ఏమి చేస్తుంటాడని విషయం చాలా మందికి తెలియదు. ఓ ఇంట్లర్వ్యూలో అనసూయ తన భర్త ఫైనాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్ గా చేస్తున్నట్టు వెల్లడించింది. సోషల్ మీడియాలో తనపై వచ్చిన పలు ట్రోలింగ్ చేసి తొలుత చాలా బాధ కలిగిందని.. ముఖ్యంగా కుటుంబం.. భర్త సపోర్ట్ వల్ల అధిగమించినట్టు వివరించింది. తన భర్త నార్త్ ఇండియాకు చెందిన వాడు కావడంతో అత్తగారింటికి వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలను పాటిస్తానని, అందరి మాదిరిగానే తలపై ముసుగు వేసుకుంటాను అని వెల్లడించింది.
Also Read: భార్య మధ్యన ఆనందడోలికల్లో పవన్…ఫోటో అదుర్స్….!