యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి యాక్టర్ గా రానిస్తున్న నటి అనసూయ. వరస సినిమా అవకాశాలు దక్కింకున్నప్పటికీ తనకు లైఫ్ ఇచ్చిన యాంకర్ వృత్తిని అనసూయ విడిచిపెట్టలేదు. అడపాదడా టీవీ షోలతో పాటూ జబర్దస్త్ కు యాంకర్ గా కొనసాగుతూనే ఉంది. క్షణం సినిమాతో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఆ తరవాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా తరవాత అనసూయ వరుస ఆఫర్లు అందుకుంటుంది.
jabardasth anasuya
రీసెంట్ గా పుష్ఫ సినిమాలో నటించిన అనసూయ పాన్ ఇండియాకు పరిచయం అయ్యింది. ఈ సినిమా పార్ట్ 2 లో అనసూయ పవర్ ఫుల్ రోల్ చేస్తోందని ఇప్పటికే సుకుమార్ ప్రకటించారు కూడా. ఇదిలా ఉండగానే ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న ఖిలాడీ సినిమాలోనూ అనసూయ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ లో అందచందాలు ఆరోబోసింది. అంతే కాకుండా మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కూడా అనసూయ చాన్స్ కొట్టేసిందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
సినిమాల విషయం పక్కన పెడితే అనసూయ గ్లామర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నాయి. జబర్దస్త్ లో అనసూయ వయ్యారాలు చూసి యువత ఎంజాయ్ చేస్తారు. అయితే ఎంతో గ్లామర్ గా కనిపించే అనసూయ వయసు తెలిసి ఇప్పుడు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రీసెంట్ గా ఓ వెబ్ సైట్ తనసూయ వయసు 40ప్లస్ అని రాసిన కథనాన్ని అనసూయ షేర్ చేసింది.
తన వయసులు 40ప్లస్ కాదని 36 అని చెప్పింది. వయసు చెప్పడంలో సిగ్గుపడనని కామెంట్ చేసింది. వయసు పెరిగినా అందంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది. తాను నిజాయితీగా ఉంటానని ఇలాంటివి రాసే జర్నలిస్టులు కూడా నిజాయితీగా ఉంటారని ఆశిస్తున్నా అంటూ కౌంటర్ వేసింది.ఇక అనసూయ వయసు 36 అనగానే ఆమె అభిమానులు అంత ఉంటుందా అని షాక్ అవుతున్నారు.