Home » పుష్ప కోసం దాక్షాయ‌ని ఎంత పుచ్చుకుందో తెలుసా…ఒక్క‌రోజుకే..?

పుష్ప కోసం దాక్షాయ‌ని ఎంత పుచ్చుకుందో తెలుసా…ఒక్క‌రోజుకే..?

by AJAY
Ad

జ‌బ‌ర్ద‌స్థ్ బ్యూటీ అన‌సూయ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. మొద‌ట న్యూస్ రీడర్ గా కెరీర్ ను ప్రారంభించిన అన‌సూయ ఆ త‌ర‌వాత టెలివిజ‌న్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. జ‌బ‌ర్ద‌స్థ్ ద్వారా ఊహించ‌ని క్రేజ్ రావ‌డంతో ఆమె కెరీర్ ప‌రంగా ఎక్క‌డా వెన‌క్కి చూసుకోలేదు.

Advertisement

చిట్టిపొట్టి డ్రెస్సుల‌తో కుర్రాళ్ల మ‌తిపోగొడుతూ జ‌బర్దస్థ్ బ్యూటీ అని పేరు తెచ్చుకుంది. ఇక జ‌బ‌ర్ద‌స్త్ షోకు ప్ర‌జాద‌ర‌ణ పెర‌గ‌టం అందులో అన‌సూయ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిల‌వ‌డంతో వ‌రుస అవ‌కావాల‌ను ద‌క్కించుకుంది. టీవీరంగంలో ఫుల్ బిజీగా ఉన్న స‌మ‌యంలోనే అన‌సూయ‌ను వెతుక్కుంటూ సినిమా అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి.

anasuya pushpa

anasuya pushpa

అయితే క్ష‌ణం సినిమాలో అన‌సూయ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ రంగ‌స్థ‌లం సినిమాతో అంత‌టి పేరును సంపాదించింది. మ‌రోవైపు అన‌సూయ ఐట‌మ్ సాంగ్ల‌లో న‌టిస్తూ కూడా ప్రేక్ష‌కుల‌కు అందాల విందు వ‌డ్డించింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ అనేక సినిమాలు చేసినా అన‌సూయ‌ను మాత్రం రంగ‌స్థ‌లం లో చేసిన రంగ‌మ‌త్తం క్యారెక్ట‌ర్ పేరుతో పిలుస్తుంటారు. ఇక రంగ‌స్థ‌లం సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సుకుమార్ మ‌రోసారి అన‌సూయ‌కు పుష్ప సినిమాలో అవ‌కాశం ఇచ్చాడు.ఈ సినిమాలో అనసూయ దాక్షాయ‌ని అనే పాత్రంలో న‌టించింది.

Advertisement

ALSO READ : ఫేక్ క‌లెక్ష‌న్లు అంటూ సిద్ధార్థ్ సంచ‌ల‌నం…కొట్టుకుంటున్న బ‌న్నీ మ‌హేశ్ ఫ్యాన్స్..!

సునీల్ కు భార్య‌గా ఈ సినిమాలో అన‌సూయ న‌టించడం విశేషం. అయితే అన‌సూయ లుక్ చూసిన అభిమానులు ఆమె రోల్ పై ఎన్నో అంచ‌నాల‌ను పెట్టుకున్నారు. కానీ సినిమాలో మాత్రం ఆట‌లో అర‌టిపండులాగానే ఉంద‌ని చాలా ఫీల్ అయ్యారు. కానీ సుకుమార్ రీసెంట్ గా ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ పుష్ప 2 లో మాత్రం అన‌సూయ పాత్ర హైలెట్ గా ఉండ‌బోతుంద‌ని తెలిపారు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం క్రేజీ ఆఫర్ల‌తో బిజీగా ఉన్న అన‌సూయ పుష్ప కోసం ఎంత పుచ్చుకుందా అని అంతా అనుకుంటున్నారు. అయితే అన‌సూయ పుష్ప సినిమా కోసం ఒక రోజుకు ల‌క్షాయాభైవేల నుండి రెండు ల‌క్ష‌లు తీసుకున్న‌ట్టు స‌మాచారం. వారం రోజుల పాటు అన‌సూయ ఈ సినిమాకు వ‌ర్క్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పుష్ప పార్ట్ 2 కోసం అన‌సూయ ఎక్కువ రోజులు షూటింగ్ కు వెళ్ల‌నుంద‌ట‌.

Visitors Are Also Reading