Home » Pushpa: పుష్పలో అతడిని చంపేది అనసూయేనా.. ?

Pushpa: పుష్పలో అతడిని చంపేది అనసూయేనా.. ?

by Bunty
Ad

అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనసూయ భరద్వాజ్ కు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అటు యాంకరింగ్ అలాగే రెండు సినిమాలు చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది అనసూయ. ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమాలోనూ బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ భామ. దాక్షాయణి అని నెగిటివ్ రోల్ లో ఈ సినిమాలో కనిపించే నుండి ఈ అందాల భామ అనసూయ.

Advertisement

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి అనసూయ లుక్ తాజాగా మరో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ సినిమా నుంచి లీక్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ లుక్ లో అనసూయ పైన చీర కొంగు లేకుండా… మంచం పై ఓ వ్యక్తి అత్యంత దారుణంగా చంపినట్లు మనకు కనిపిస్తుంది. అనసూయ నోటిలో బ్లేడ్ పెట్టుకొని ఉన్న లుక్ లో అనసూయ కిల్లర్ లేడీగా మనకు కనిపిస్తుంది.

అయితే అనసూయ చేతిలో హత్య కు గురి కాబోతోంది ఎవరో కాదు… సునీల్ అని అంటున్నారు. ఈ సినిమాలో మంగళం శ్రీనుగా సునీల్ నటిస్తున్నాడు. సునీల్ భార్య అనసూయ నటిస్తోందని… తన భర్తని ఆమె చంపేస్తుంది అని ఈ సినిమాపై కొన్ని పుకార్లు వస్తున్నాయి. మొత్తానికి ఈ పోస్టర్ ఆన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading