Home » అక్కా అనలా ఆంటీ అనాలా..? నెటిజన్ ప్రశ్నలకు అనసూయ మైండ్ బ్లాక్ ఆన్సర్…!

అక్కా అనలా ఆంటీ అనాలా..? నెటిజన్ ప్రశ్నలకు అనసూయ మైండ్ బ్లాక్ ఆన్సర్…!

by AJAY
Ad

జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం యాంకర్ గా కంటే నటిగా ఫుల్ బిజీగా ఉంది. అనసూయ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. రీసెంట్ గా విడుదలైన పుష్ప సినిమాలో సునీల్ కు భార్య గా మాస్ క్యారెక్టర్ దాక్షాయణి పాత్రలో అనసూయ మెప్పించింది. అయితే పుష్ప పార్ట్ 1లో అనసూయకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.

Advertisement

కానీ పుష్ప పార్ట్ 2 లో మాత్రం అనసూయ పాత్ర హైలెట్ గా ఉండబోతుంది అంటూ సుకుమార్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ఇది ఇలా ఉండగా అనసూయ రవితేజ హీరోగా నటిస్తున్న కిలాడి సినిమాలో కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో అనసూయ తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది.

Advertisement

ఇక షూటింగ్ లకు గ్యాప్ దొరికింది అంటే అనసూయ నెట్టింట ఫ్యాన్స్ తో కలిసి సరదాగా ముచ్చటిస్తూ టైం పాస్ చేస్తుంది. ఈ నేపథ్యం లోనే అనసూయ తాజాగా అభిమానులతో సరదాగా అడగండి అంటూ ముచ్చట్లు పెట్టింది.

దాంతో ఓ అభిమాని మిమ్మల్ని అక్కా అని పిలవాలా ఆంటీ అని పిలవాలా అంటూ ప్రశ్న వేశాడు. దానికి అనసూయ “ఏదీ వద్దు అలా పిలిచేంత స్నేహం మన మద్యన లేదు. ఇలా పిస్తాము అని అడగటం మీ పెంపకాన్ని ప్రశ్నిస్తుంది. ఇది ఏజ్ షేమింగ్ అంటూ ఫైర్ అయ్యింది.

దానికి ఆ నెటిజన్ మళ్లీ ఎవరినైనా అక్కా అని పిలిచినంత మాత్రానా ఏజ్ షెమింగ్ అవ్వదు ….అలాంటప్పుడు ప్రశంసలు కూడా తీసుకోవద్దు. అంటూ కౌంటర్ ఇచ్చాడు. దానికి అనసూయ మళ్ళీ అయ్యుండొచ్చు కానీ ఏ ఉద్దేశ్యం తో పిలుస్తున్నారు అనేది ముఖ్యం. అయినా ప్రశంసలు తీసుకోవాలా వద్దా అన్నది వాళ్ల వాళ్ళ ఇష్టం కదా అంటూ నెటిజన్ కు కౌంటర్ ఇచ్చింది.

Visitors Are Also Reading