Home » ANASUYA : నా భ‌ర్త‌లాంటి వాళ్లు ఈ ప్రపంచానికి అవ‌స‌రం…క‌న్నీళ్లు పెట్టుకున్న అనసూయ‌…!

ANASUYA : నా భ‌ర్త‌లాంటి వాళ్లు ఈ ప్రపంచానికి అవ‌స‌రం…క‌న్నీళ్లు పెట్టుకున్న అనసూయ‌…!

by AJAY
Ad

టాలీవుడ్ టాప్ యాంక‌ర్ ల‌లో అన‌సూయ కూడా ఒక‌రు. స‌మ త‌ర‌వాత అంత‌టి క్రేజ్ సంపాదించుకున్న ఫీమేల్ యాంక‌ర్ ఎవ‌రైనా ఉన్నారా అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చే పేరు అన‌సూయ‌నే. అంతే కాకుండా అన‌సూయ న్యూస్ రీడ‌ర్ గా కెరీర్ ను మొద‌లుపెట్టి ప్ర‌స్తుతం టాప్ యాంక‌ర్ గా న‌టిగా ఎదిగింది. ఇదిలా ఉంటే అన‌సూయ ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటూ సినిమాల్లోనూ సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

jabardasth anasuya

jabardasth anasuya

రంగ‌స్థ‌లం, క్ష‌ణం సినిమాల‌తో అనూసూయ త‌న‌లోని టాలెంట్ ను బ‌య‌ట‌పెట్టింది. ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ ల‌తో దూసుకుపోతోంది. రీసెంట్ వ‌చ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప‌ల‌లో కూడా అన‌సూయ అద‌ర‌గొట్టింది. అంతే కాకుండా రవితేజ హీరోగా న‌టించిన ఖిలాడీ సినిమాలో కూడా అనసూయ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. ఇక ప్ర‌స్తుతం పలు చిత్రాల‌తో బిజీగా ఉంది.

Advertisement

Advertisement

అటు సినిమాల‌ను ఇటు టీవీ షోల‌ను మ్య‌నేజ్ చేస్తున్న అన‌సూయ తాజాగా త‌న భ‌ర్త‌పై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. ఈ టీవీలో మ‌ల్లెమాల వారు అన్ని పండ‌గ‌ల‌కి ఈవెంట్ ల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే శ్రీరామ‌న‌వ‌మి ఈవెంట్ ను కూడా నిర్వ‌హించారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఇక ఈ ప్రోమోలో అన‌సూయ ఎమోష‌న‌ల్ అయ్యింది.

ఆటో రామ్ ప్ర‌సాద్ అన‌సూయను త‌న భ‌ర్త బ‌ర‌ద్వాజ్ గురించి చెప్పాల‌ని కోరాడు. దాంతో అన‌సూయ మా ఆయ‌న లాంటి భ‌ర్త ఈ ప్ర‌పంచానికి చాలా అవ‌స‌రం అంటూ ఏడ్చేసింది. దాంతో అంద‌రూ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇదిలా ఉంటే అనసూయ భ‌ర్త భ‌ర‌ద్వాజ్ అమెకు ఎంతో స‌పోర్ట్ చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో కూడా అనసూయ త‌న భ‌ర్త గురించి చెబుతూ పొగిడిన సంధ‌ర్భాలు ఉన్నాయి.

Visitors Are Also Reading