Home » అనసూయకు విమాన కష్టాలు..!

అనసూయకు విమాన కష్టాలు..!

by Azhar
Ad
అనసూయ భరధ్వాజ్ ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ లో ఉంటుంది అనేది తెలిసిందే. అయితే ఎప్పటినుడో సినిమాల్లో ఉన్న అనసూయకు జబర్దస్త్ ద్వారానే ఎక్కువ గుర్తింపు అనేది వచ్చింది. అయితే అందులో చేస్తూనే సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలో కనిపించిన అనసూయ.. ఈ మధ్య ఆ షో నుండి వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు తెర లేపిన విషయం తెలిసందే.
ఆంటీ.. అనే ఒక్క పదంతో సోషల్ మీడియాను కొన్ని రోజులు అనసూయ ఊపేసింది అనే చెప్పాలి. ఆంటీ అంటే కేసులు పెడుతా అని అనసూయ చెప్పడం దానిలో హైలెట్ అనే చెప్పుకోవాలి. కానీ ఈ మధ్య ఆ రచ్చ అనేది కొత్త తగ్గిపోయిన… అనసూయకు విమానంలో కష్టాలు ఎదురయ్యాయి అని సోషల్ మీడియాలోనే పేర్కొంది.
తాజాగా బెంగళూర్ వెళ్లిన అనసూయ తిరిగి హైదాబాద్ కు రావడానికి అలియన్స్ ఎయిర్ సంస్థలో టికెట్స్ ఫ్యామిలీకి బుక్ చేసింది. ఇక ఈ ఫ్లైట్ మొదట అరగంట ఆలస్యం అయ్యింది అని చెప్పింది. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కుతుంటే మాస్క్ లేదని ఆపారని.. మాస్క్ పెట్టుకొని ఎక్కితే.. మా నలుగురిని ఒక్కొక్కరిని ఒక్కో చోట కూర్చో బెట్టారు అని చెప్పింది. కానీ తాను అందరికి ఒక్కే చోట టికెట్స్ అనేవి బుక్ చేశాను అని చెప్పింది. అలాగే విమానంలో సీట్స్ సరిగా లేక.. నా డ్రెస్ చినిగింది అని అనసూయ పేర్కొంది.

Advertisement

Visitors Are Also Reading