ఆనందం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన హీరో ఆకాష్. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా మంచివిజయం సాధించింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ నటనకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు. అయితే అప్పటికే ఆకాష్ తమిళ్ ఓ సినిమా చేశాడు కానీ ఆ సినిమా అంత పెద్ద హిట్ కాలేకపోయింది. ఇక ఆనందం తో మంచి విజయం రావడం తో ఆ తరవాత ఆనందం ఆనందమాయే అనే సినిమాలో నటించాడు.
Advertisement
మరికొన్ని తమిళ సినిమాల్లో కూడా ఆకాష్ నటించాడు. కానీ అనుకున్నమేర హీరోగా సక్సెస్ అవ్వలేకపోయాడు. అయితే తాజాగా ఆకాష్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన తండ్రి ఆంధ్రా అని తల్లి తమిళ్ అని చెప్పాడు. ఇక తాను చదువుకుంది మొత్తం లండన్ లో అని అక్కడ తనకు వ్యాపారాలు ఉన్నాయని చెప్పాడు. తనని ఇండస్ట్రీ లో ఎదగనివ్వకుండా చేశారు అంటూ ఆరోపించాడు.
Advertisement
ఆనందం లాంటి సూపర్ హిట్ తర్వాత తనకు సెకండ్ హీరోగా అవకాశం వచ్చింది అన్నాడు. ఉదయ్ కిరణ్ సినిమాలో తనను సెకండ్ హీరోగా అడిగారని తాను హీరోగా చేయకూడదు అనే అలా అడిగారని చెప్పారు. ఇండస్ట్రీ లోకి నేరుగా వచ్చి సూపర్ హిట్ కొట్టడంతో కావాలనే అలా చేశారని అన్నారు.
తాను అప్పుడు ఉదయ్ కిరణ్ కు పోటీగా ఉండేవాడిని అని కాలేజీల్లో సగం మంది నా ఫ్యాన్స్ ఉంటే సగం మంది ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఉండేవారని అన్నారు. ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమా ఆఫర్ తనకే వచ్చిందని కానీ తమిళ్ లో బిజీ ఉండటం వల్ల చేయాలేక పోయా అంటూ చెప్పారు. ఇక తాను వెంకటేష్ పక్కన వసంతం, నమో వెంకటేశ సినిమాలు చేశానని…కానీ తాను ఇండస్ట్రీ కి హీరో అవ్వాలని వచ్చా అని అందుకే ఆ తరవాత ఇంట్రస్ట్ లేక సైడ్ క్యారెక్టర్ లు వేస్తే సినిమాలు చేయలేదని చెప్పారు.