Home » ఆనంద్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…ఏం చేస్తుందో తెలిస్తే శభాష్ అంటారు…!

ఆనంద్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…ఏం చేస్తుందో తెలిస్తే శభాష్ అంటారు…!

by AJAY
Ad

టాలీవుడ్ కు ఎంతోమంది చైల్డ్ ఆరిస్ట్ లు పరిచయం అయ్యారు. కొంతమంది చిన్నప్పటి హీరో, హీరోయిన్ ల పాత్రల్లో నటిస్తే మరికొందరు సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకుంటారు. అయితే కొంతమంది మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారు. అలా ప్రేక్షకుల మనసు దోచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ లలో భకిత కూడా ఒకరు.

Advertisement

భకిత పేరు చెప్తే గుర్తు పట్టరు ఏమోగానీ…. ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తుంది. ఆ పాప పేరే భకిత…. ఆనంద్ సినిమా లో హీరో పక్కన కనిపిస్తూ ఎప్పుడూ ఆనంద్ అంటూ పిలుస్తూ కనిపిస్తుంది. బబ్లీ గా కనిపిస్తూ భకిత ఎంతో మంది మనసు దోచుకుంది.

Advertisement

అంతేకాకుండా ఈ సినిమాలో తన నటనకు గాను నంది అవార్డును సైతం అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత మాత్రం ఏ సినిమాలో కూడా భకిత నటించలేదు. ఈ సినిమా వచ్చి 18 ఏళ్లు అవుతోంది. ఇక ఈ సినిమాకు ఎన్నేళ్లు గడిచినా అభిమానులు ఉంటారు.

ఈ నేపథ్యంలోనే భకిత గురించి వెతకడం మొదలు పెట్టారు. భకిత ఇప్పుడు ఏం చేస్తుంది…? ఎలా ఉంది..? అని ఆసక్తిగా వెతుకుతున్నారు. భకిత వయస్సు ఇప్పుడు 28 ఏళ్ళు అయితే ఆనంద్ సినిమా తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం కూడా జరగలేదు. చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలుగా హీరోయిన్ లుగా పరిచయం అవుతున్నా భకిత మాత్రం సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. చదువులో చురుగ్గా ఉండే భకిత మహిళల హక్కుల కోసం పోరాడుతోంది. ఉమెన్ ఈక్వాలిటీ…. గర్ల్స్ రైట్స్ అంటూ ఆడవారి కోసం పని చేస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం అమెరికాలో స్థిరపడింది.

Visitors Are Also Reading