ప్రముఖ పారిశ్రామిక వేత్త మహింద్రాఅండ్ మహీంద్రా ఆటోమొబైల్స్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నెటిజన్లు అడిగే ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో చమత్కారంతో కూడిన సమాదానం చెబుతూ అందరినీ ఆకట్టుకుంటారు. తాజాగా ఆయనకు ఓ నెటిజెన్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
Ads
అది ఏమిటంటే.. సార్, మీరు మహింద్రా కార్లు తప్ప ఇతర కార్లను మీరు డ్రైవ్ చేయరా..? అని నెటిజన్ ప్రశ్నించారు. అంటే మహింద్రా కాకుండా వేరే కార్లు కూడా ఉన్నాయని చెబుతున్నారా..? నాకు ఐడియా లేదు అని సమాదానం ఇచ్చారు. అదేవిదంగా ఊరికే ఏదో సరదాగా అంటున్నానని స్మైలీ ఎమోజీని పెట్టారు. ఆయన చమత్కారమునకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం మహీంద్రా ను ప్రశ్న అడగడం.. సమాదానం చెప్పడం ఓ హాట్ టాపిక్ గా మారింది.