Home » పసివాడి ప్రాణం మూవీలో మెగాస్టార్ తో చేసిన నటుడు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

పసివాడి ప్రాణం మూవీలో మెగాస్టార్ తో చేసిన నటుడు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఇండస్ట్రీలో విలన్లు కూడా హీరోలతో సమానంగా పేరు తెచ్చుకుంటున్నారు. కానీ కొన్ని ఏళ్ల క్రితం హీరోలు అందంగా ఉంటే విలన్లు చాలా భయంకరంగా ఉండేవారు. వాళ్ల అవతారం చూస్తేనే విలన్ అని అర్థం చేసుకునే విధంగా కనిపించేవారు. అలా పాతిక సంవత్సరాల క్రితం చిరంజీవితో నటించి అందరినీ భయపెట్టిన ఒక నటుడు ఒక ఊహించని రంగంలో దూసుకుపోతున్నాడు.. మరి ఆయనెవరు అనే విషయాలు చూద్దాం..

Advertisement

also read:అమ్మాయిలు త‌మ‌కు న‌చ్చిన అబ్బాయితో ఇలా ప్ర‌వ‌ర్తిస్తార‌ట‌..!

చిరంజీవి హీరోగా నటించిన పసివాడి ప్రాణం సినిమా అందరికీ తెలుసు. దీనిలో చిన్న బాబుని కిడ్నాప్ చేసే పాత్రలో కనిపించి తెరమీద బాబునే కాక సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా భయపెట్టిన విలనే ఈ బాబు ఆంటోని. తెలుగు, తమిళం, హిందీ,కన్నడ,మలయాళం ఇలా పలుభాషలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో విలన్ గా చేసిన మిగతా భాషలో హీరోగా చేశారు. తెలుగులో పసివాడి ప్రాణం, జేబుదొంగ, శత్రువు, నిప్పు రవ్వ, లారీ డ్రైవర్, ఏకలవ్యుడు వంటి చిత్రాల్లో చేశారు.

Advertisement

also read:ఈ 3 పేర్లు గ‌ల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీ జీవితాలు మారిపోతాయాట‌…!

ఇందులో పసివాడి ప్రాణం, త్రినేత్రుడు సినిమా మంచి గుర్తింపుని ఇచ్చాయి. మొత్తం 175 సినిమాల్లో నటించారు. మలయాళ చిత్ర పరిశ్రమ వజ్రోత్సవ వేడుకల్లో బాబు అంటోనిని ఘనంగా సత్కరించారు. అయితే ఈయన రష్యన్ అమెరికన్ మహిళ ఇవాగేనియాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు సంతానం. ఈయన సినిమాలో నటించడమే కాక కోచింగ్ సెంటర్ ఒకటి ప్రారంభించారు. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చే స్కూలు స్థాపించి ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా స్కూల్ ఓపెన్ చేశాడు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చే స్కూల్స్ స్థాపించి శిక్షణ ఇస్తున్నాడు. బాబు ఆంటోనీ నటుడు మాత్రమే కాక దర్శకుడు కూడా, ఇలా నటన రంగంలోనే కాకుండా మార్షల్ ఆర్ట్స్ లో మంచి పేరు సంపాదించుకున్నారు ఆంటోనీ.

also read:రజనీకాంత్ వాఖ్యాలతో NTR ఆత్మ ఘోషిస్తోంది – రోజా

Visitors Are Also Reading