Home » ఇండియాలోనే ఫ‌స్ట్ గ్రాఫిక్స్ మూవీ అమ్మోరు! ఆ చిత్ర విశేషాలు!!

ఇండియాలోనే ఫ‌స్ట్ గ్రాఫిక్స్ మూవీ అమ్మోరు! ఆ చిత్ర విశేషాలు!!

by Azhar
Published: Last Updated on
Ad

సినీరంగంలో తెలుగోడి స‌త్తాను రాజ‌మౌళి కంటే ముందే దేశానికి చాటిన ఘ‌న‌త అమ్మోరు సినిమాది! టెక్నాల‌జీ అంత‌గా లేని రోజుల్లో అమ్మోరు సినిమాకు వాడిన గ్రాఫిక్స్ ను చూసి పెద్ద పెద్ద టెక్నీషియ‌న్స్ యే ముక్కున వేలేసుకున్నారు.! ఈ సినిమా పూర్త‌వ్వ‌డానికి దాదాపు 4 ఏళ్ల స‌మ‌యం ప‌ట్టింది.సౌంద‌ర్య‌కు 3వ సినిమాగా షూట్ ప్రారంభ‌మైన ఈ సినిమా రిలీజ్ అయ్యే స‌రికి 27వ సినిమా అయ్యింది. అంటే ఆ గ్యాప్ లో సౌంద‌ర్య 24 సినిమాలు పూర్తిచేసింద‌న్న‌మాట‌! ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మ‌రో పాత్ర ర‌మ్య‌కృష్ణ. ఈ సినిమాలో ఆమె న‌ట‌న న‌భూతో న‌భ‌విష్య‌త్!

Also Read: Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?

Advertisement

Advertisement

1995లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి 1.8 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే…ఈ సినిమా దాదాపు 11 కోట్లు క‌లెక్ట్ చేసింది. తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన ఈ సినిమాను త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోకి డ‌బ్ చేశారు అక్క‌డ కూడా కోటి రూపాయ‌లు వ‌సూల్ చేసింది ఈ సినిమా!

ఈ సినిమాకంటే ముందే గ్రాఫిక్స్ ఉన్న విఠాలాచార్య సినిమాలు, భైర‌వ‌ద్వీపం సినిమా వ‌చ్చిన‌ప్ప‌టికీ ఫుల్ లెంత్ గ్రాఫిక్స్ మూవీ మాత్రం ఇదే! తండ్రికొడుకులైన చక్రవర్తి, శ్రీ కొమ్మినేని ఇద్ద‌రూ ఈ చిత్రానికి సంగీతాన్నందిచ‌డం విశేషం!

Also Read: బాహుబ‌లి దోశ తింటే రూ.71వేలు బ‌హుమ‌తి

Visitors Are Also Reading