రష్యా ఉక్రెయిన్ మధ్య వాతావరణం టెన్షన్‌గా రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా రష్యా దళాలు సరిహద్దు నుంచి వెనక్కి వచ్చాయని గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సరిహద్దులో ఉద్రిక్తత మాత్రం తగ్గడం లేదనే చెప్పవచ్చు. సరిహద్దులో బ్లాక్ సీలో రష్యా యుద్ధ విన్యాసాలు చేస్తోంది. బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైల్ తో విన్యాసాలు చేస్తున్నది. సరిహద్దు ప్రాంతాలలో భయాందోళనలు నెలకొన్నాయి. న్యూక్లియర్ సామర్థం కలిగి ఉన్న బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా రష్యా ప్రయోగించినది.
Also Read : కళాకారులతో కాలు కదిపిన కేంద్ర మంత్రి…వీడియో వైరల్…!
Advertisement
Advertisement
ముఖ్యంగా మిస్సైల్ ప్రయోగించడంతో ఉక్రెయిన్‌తో పాటు నాటో, అమెరికా దేశాలు అప్రమత్తం అయ్యాయి. రష్యా పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాలు చేస్తుంది. టీయూ 95 బాంబర్స్, సబ్ మెరైన్లు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. యుద్ధ రిహార్సిల్ లో టార్గెట్‌లను చేధించామని రష్యా రక్షణ శాఖ స్పష్టం చేసినది. రష్యా దూకుడు మీద ఉండడంతో నాటో, అమెరికా దేశాలు ఆలోచనలో పడ్డాయి. ఒకవేళ యుద్ధం తప్పనిసరి అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా చర్చిస్తూ ఉన్నాయి.
Also Read : టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్.. వైస్ కెప్టెన్ ఎవరంటే..?