Home » అమెరికా వైద్యులు అరుదైన చికిత్స.. గర్భస్థ పిండానికీ బ్రెయిన్ సర్జరీ..!

అమెరికా వైద్యులు అరుదైన చికిత్స.. గర్భస్థ పిండానికీ బ్రెయిన్ సర్జరీ..!

by Anji
Ad

ప్రపంచ వైద్య శాస్త్రంలోనే ఓ మహా అద్భుతమే చోటు చేసుకుంది.  గర్భంలోనే ఉన్న పిండం మెదడుకు అమెరికా వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ప్రాణాపాయం స్థితి నుంచి రక్షించారు. తల్లి గర్భంలోనే ఉండగా శిశువుకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించడం ప్రపంచంలోనే మొదటి సారి. బోస్టన్ చిల్ట్రన్స్ హాస్పిటల్ బ్రిఘాం అండ్ ఉమెన్స్ హాస్పిటల్ డాక్టర్లు ఈ ఘనత సాధించారు. ముఖ్యంగా గర్భస్థ శిశువులో మెదడులో రక్తనాళాల అసాధారణ స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు వైద్యులు. 

Also Read : ఎండాకాలంలో వీళ్లు అస్సలు పుచ్చకాయని తీసుకోకూడదు…!

Advertisement

ఈ చిన్నారి మెదడులో వెయిన్ ఆఫ్ గాలెన్ మాల్ ఫార్మేషన్ అనే అరుదైన రుగ్మత తలెత్తింది. ప్రధానంగా మెదడులోని ధమనులు అక్కడి ప్రధాన సిరతో అనుసంధానం అవుతాయి. దీని ఫలితంగా ఆ సిర విస్తరించి దాని గుండా ఎక్కువగా రక్తం ప్రవహిస్తుంది. దీంతో ఆ చిన్నారి యొక్క గుండె, ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. జన్మించిన కొద్ది రోజులకే ఈ శిశువుల్లో గుండె వైఫల్యం తలెత్తే అవకాశముంది. పక్షవాతం లాంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశముంది.  

Also Read :  స్టార్ హీరో..హిట్ ప్రొడ్యూసర్ ఉన్నా బ్రహ్మోత్సవం ఫ్లాప్ కు కారణం అదేనా…?

Manam News

Advertisement

తల్లి గర్భంలో దాదాపు 30 వారాల వయస్సు ఉన్నప్పుడు ఆ సమస్యను ఈ చిన్నారిలో డాక్టర్లు గుర్తించారు. ప్రధాన సిర వెడల్పు 14 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగాఉన్నట్టు తేల్చారు. ఈ సిర వెడల్పు 8 మిల్లిమీటర్లు, లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్టయితే.. ఆ చిన్నారి జన్మించిన వెంటనే అనారోగ్యం భారిన పడే అవకాశం 90 శాతం ఉందని బోస్టన్ ఆసుపత్రి డాక్టర్ డారెన్ ఓర్బాక్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గర్భస్థ శిశువుకు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

Also Read :  అఖిల్ కెరీర్ లో భారీ నష్టాలను తెచ్చిపెట్టిన సినిమాలు ఇవే…!

చికిత్స చేసిన విధానం : 

  • శస్త్ర చికిత్సకు ముందు తల్లితోపాటు చిన్నారికి కూడా డాక్టర్లు ఇంజెక్షన్ ద్వారా మత్తు ఇచ్చారు. 
  • ఆ తరువాత గర్భాశయం ద్వారా ఒక సూదిని లోపలికి చొప్పించారు. అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ సహాయంతో వీక్షిస్తూ.. సూదిని పిండం తల వెనుక భాగానికి తీసుకెళ్లారు. 
  • సూది మొనను మెల్లగా మెదడులోని సిరలోకి నెట్టారు. దాని ద్వారా క్యాథెటర్ ను ప్రవేశపెట్టారు. ఈ సాధనం సాయంతో ప్రత్యేక లోహపు కాయిల్స్ ను సిరలోకి చొప్పించారు. 
  • సిరలో ఇబ్బంది వల్ల ఏర్పడ్డ అదనపు చోటును ఈ కాయిల్స్ భర్తీ చేసాయి. దీంతో ఆ రక్తనాళం గుండా ప్రవహించే రక్త పరిమాణం తగ్గిపోయింది. 
  • సంబంధిత సిర వెడల్పు 5 మిల్లిమీటర్లకు తగ్గినట్టు గుర్తించారు. 
  • రెండు రోజుల తరువాత ఈ శిశువు నెలలు నిండకుండానే జన్మించింది. ఆ చిన్నారికి ఇప్పుడు 7 వారాల వయస్సు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. 
Visitors Are Also Reading