Home » నేను లక్కీ…నా మాజీ భార్యలతో అనుబంధం ఉంది : అమీర్ ఖాన్

నేను లక్కీ…నా మాజీ భార్యలతో అనుబంధం ఉంది : అమీర్ ఖాన్

by AJAY
Ad

చిత్ర పరిశ్రమలో భార్య భర్తలు విడాకులు తీసుకోవడం పెద్ద వింత ఏమో కాదు. ఇక బాలీవుడ్ లో అయితే ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. చాలా మంది బాలీవుడ్ జంటలు విడిపోయి హ్యాపీ గా ఉంటున్నాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా తన భార్యలతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ హీరో ఏకంగా ఇద్దరు భార్యల కు విడాకులు ఇచ్చాడు.

Advertisement

మరోవైపు దంగల్ సినిమా నటితో డేటింగ్ లో ఉన్నాడని త్వరలోనే ఆ నటిని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అమీర్ ఖాన్ తాజాగా విడాకుల పై ఓ ఇంటర్వ్యూ లో స్పందించాడు. మేము విడాకులు తీసుకున్నా వివాహ వ్యవస్థ ను గౌరవిస్తామని అన్నారు.

Advertisement

ఇప్పటికీ నా ఇద్దరు మాజీ భార్యలతో నాకు అనుబందం ఉండటం నా అదృష్టం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళతో మాట్లాడటం తో పాటు పిల్లల విషయం పై కలిసి కట్టుగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ మొదటగా 1986 లో రీనా దత్తా ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆమెకు 2002 లో విడాకులు ఇచ్చి 2005 లో కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా 2020 లో కిరణ్ రావుకు సైతం అమీర్ ఖాన్ విడాకులు ఇచ్చాడు.

Visitors Are Also Reading