Ambedkar Quotes in Telugu: బిఆర్ అంబేద్కర్ కొటేషన్స్ భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డా.బీ.ఆర్. అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఓ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయ వేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్. అంటరాని తనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్. దేశంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు, అన్ని మతాలు, తెగలకు సమన్యాయం జరిగేవిధంగా వారి హక్కులకు భగం వాటిళ్లకుండా ఉండేందుకు సర్వసత్తాక, సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సూక్తులను మనం కొన్నింటిని తెలుసుకుందాం.
Advertisement
B.R Ambedkar Jayanthi Quotes and Powerful Ambedkar Quotes
- శాంతి భద్రతలు అనేవి రాజకీయమనే శరీరానికి ఔషదం లాంటివి. రాజకీయ శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు ఆ ఔషదం తప్పకుండా ఇవ్వాలి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్.
- మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను సమాజ పురోగతిని కొలుస్తాను. భారత రాజ్యాంత నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్.
- స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ.. బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలు ఉన్న బానిస వెయ్యి రెట్లు మేలు. బి.ఆర్. అంబేద్కర్.
- రాజ్యాంగం దుర్వినియోగం చేయబడిందని నేను కనుగొంటే, దానిని కాల్చే మొదటి వ్యక్తి నేను. బి.ఆర్. అంబేద్కర్.
- నేను కోరేది ధర్మం మీద ఆధారితమైన శాంతినే గాని, శ్మశాన వాటికలో తాండవించే శాంతికాదు. ధర్మాన్ని మన్నించని అంత కాలం ఈ ప్రపంచంలో శాంతి లేదు. బి.ఆర్. అంబేద్కర్.
- మీరు సామాజిక స్వేచ్ఛను సాధించనంత కాలం, చట్టం ద్వారా ఏ స్వేచ్ఛను అందించినా ప్రయోజముండదు. అంబేద్కర్.
- మీ భానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి అందుకే దేవుడి మీద కానీ, మహానుభావుల మీద కానీ, ఆధారపడొద్దు. అంబేద్కర్.
- నా దేశ సమస్యలకు, నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణ వస్తే.. తొలుత నా జాతికి ప్రాముఖ్యత ఇస్తాను, నేను, నా దేశం ఈ రెండింటిలో నా దేశమే నాకు ముఖ్యమైనది. బి.ఆర్. అంబేద్కర్.
- కులం పునాదుల మీద మీరు ఏం సాధించలేరు, ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు – బి.ఆర్. అంబేద్కర్
- జీవించేందుకే మనిషి తినాలి, సమాజ సంక్షేమానికి జీవించాలి- బి.ఆర్.అంబేద్కర్.
Advertisement